చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లలేదా.. డౌట్ ఎందుకంటే..?
చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారని, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించాడని, కలసి డిన్నర్ కూడా చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా అబద్ధమని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: చిరంజీవి - పవన్ కళ్యాణ్‌లు గురువారం నాడు సాయంత్రం కలుసుకున్నారని, ఖైదీ నెంబర్ 150 సినిమా విజయానికి ఆయన అభినందనలు తెలిపారని, అలాగే, ఇతర అంశాల పైన కూడా చర్చ జరిగినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అన్నదమ్ములు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించాడని, కలసి డిన్నర్ కూడా చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా అబద్ధమని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లడం పుకారేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు చిరంజీవి ఓ ఫంక్షన్‌లో పాల్గొన్నారని చెబుతున్నారు.

చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ అయిన ఖైదీ నెంబర్ 150 ఘనవిజయం సాధించడంతో టి సుబ్బిరామి రెడ్డి ఓ పార్టీ ఇచ్చారని, ఈ పార్టీకి హైదరాబాద్‌లో ఉన్న చాలామంది ప్రముఖులు హాజరయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి.
వారిలో హీరో అక్కినేని నాగార్జున కూడా ఉన్నారని, దీంతో చిరంజీవిని పవన్ కలవడం అనేది పూర్తిగా రూమర్ అని చర్చించుకుంటున్నారు మరో ప్రచారం సాగుతోంది.
ఒకవేళ చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లడం నిజమే అయినా అన్నయ్యతో సుదీర్ఘంగా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించడం, డిన్నర్ చేయడం మాత్రం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేస్తున్నారు.












Click it and Unblock the Notifications