మేం రెచ్చగొడుతున్నామా: కేసీఆర్‌పై కోదండరాం ఆగ్రహం, ఆవేదన
ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరితే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపణలు చేయడం విడ్డూరమని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం గురువారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరితే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపణలు చేయడం విడ్డూరమని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం గురువారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాలో ఆయన 'నిరుద్యోగుల ఆకాంక్షలు - తెలంగాణ భవిష్యత్' అనే అంశంపై సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
లక్ష ఖాళీలుంటే నాలుగు వేల పోస్టులు భర్తీ చేస్తే ఎలాగని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన క్యాలెండర్ ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రయివేటు కంపెనీల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. నిరుద్యోగుల నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

భూసేకరణ వ్యవహారంలో ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చిన్న, సన్నకారు రైతుల భూములు లాక్కొని, పారిశ్రామిక వర్గాలకు అఫ్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
123 జీవో ద్వారా భూమి కొనడం చట్ట విరుద్దమని తాము ముందే చెప్పామన్నారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేస్తామని తాజాగా జీవో తెచ్చారన్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వానికి ఎందుకు సోయి లేకుండా పోయిందన్నారు.












Click it and Unblock the Notifications