ఎర్రబల్లితో విబేధాలందుకే, జగన్ ఎవరి మాట వినడు, 2019లో రెండు సీట్లు అడుగుతా: కొండా సురేఖ

హైదరాబాద్: టిఆర్ఎస్‌లో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తమకు మంత్రి పదవి ఇస్తే తమ రాజకీయంగా ఇబ్బందులు ఎదురౌతాయని భావించి మంత్రి పదవిని రాకుండా అడ్డుకొన్నారని సురేఖ ఆరోపించారు.

2019 ఎన్నికల్లో రెండు సీట్లు ఇవ్వాలని అడుగుతామని సురేఖ చెప్పారు. రాజకీయంగా తమ ఎదుగుదలకు వైఎస్ఆర్ సహకరించారని ఆమె చెప్పారు. తండ్రి తరహలో కొడుకు ఆలోచనలు లేవని వైఎస్ జగన్‌‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను ప్రస్తావించారు.ఏ పరిస్థితుల్లో టిఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది. టిఆర్ఎస్‌లో మంత్రి పదవి ఎందుకు దక్కలేదనే విషయమై కొండా సురేఖ గుర్తు చేసుకొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులను కొండా సురేఖ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయాల్లో తమ ఉన్నతికి వైఎస్ఆర్ కృషి చేశారని ఆమె చెప్పారు.

రాజకీయాల్లో ఎదుగుదలకు వైఎస్ఆర్ కృషి

రాజకీయాల్లో ఎదుగుదలకు వైఎస్ఆర్ కృషి

రాజకీయాల్లో తమ ఎదుగుదలకు వైఎస్ఆర్ కృషి చేశారని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో తమకు వైఎస్ఆర్ మద్దతు ఇచ్చారని సురేఖ చెప్పారు. అయితే వైఎస్ఆర్ సూచన మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ తనకు ఆనాడు టిక్కెట్టు ఇప్పించారని సురేఖ గుర్తు చేశారు.

దయాకర్‌రావుతో విబేధాలు

దయాకర్‌రావుతో విబేధాలు

తమ కుటుంబం తొలుత టిడిపిలోనే ఉండేదాని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. దయాకర్‌రావు అనుచరుడిగా తన భర్త మురళి టిడిపిలో కొనసాగేవాడని ఆమె గుర్తు చేశారు. అయితే దయాకర్‌రావు రాజకీయంగా మురళిని ఎదగకుండా చేయాలనే ప్లాన్ చేశాడని ఆ విషయం తెలిసి తాము టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో వైఎస్ఆర్ తమకు మద్దతు ఇచ్చారని చెప్పారు.

వైఎస్ఆర్‌కు, వైఎస్ జగన్‌కు అదే తేడా

వైఎస్ఆర్‌కు, వైఎస్ జగన్‌కు అదే తేడా

వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి, వైఎస్ జగన్‌కు మధ్య తేడా ఉందని మాజీ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఏదైనా చెబితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వింటాడని కొండా సురేఖ చెప్పారు. అందరితో ఆ విషయాలను చర్చిస్తారని చెప్పారు. అంతేకాదు ఆ విషయమై అభిప్రాయాలను తీసుకొంటారని ఆమె గుర్తు చేసుకొన్నారు. వైఎస్ జగన్ వ్యవహరశైలి అలా ఉండదన్నారు. ఎవరూ కూడ చెప్పేది వినడని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ఏం చేస్తాడో కూడ చెప్పడని కొండా సురేఖ చెప్పారు.

టిఆర్ఎస్‌ను తిట్టలేదు

టిఆర్ఎస్‌ను తిట్టలేదు

తాము ఏనాడూ కూడ టిఆర్ఎస్‌ను తిట్టలేదని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆనాడు పథకం ప్రకారంగా తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని కొండా సురేఖ చెప్పారు. పెట్రోల్ బాంబులు వేశారని చెప్పారు. అయితే పథకం ప్రకారంగా హత్య చేసేందుకు ప్రయత్నించారని సురేఖ చెప్పారు.ఈ తరుణంలోనే తాను ఆనాడూ ఆవేశంలోనే అలా వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. టిఆర్ఎస్‌లో చేరే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించి క్షమాపణలు కోరినట్టు చెప్పారు.

2019లో రెండు సీట్లు అడుగుతా

2019లో రెండు సీట్లు అడుగుతా

2019 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నామని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. భూపాలపల్లిలో నా కూతురును బరిలోకి దింపాలని భావిస్తున్నామన్నారు. టిఆర్ఎస్ చీప్ కెసిఆర్‌ను రెండు సీట్లు అడుగుతామన్నారు. అయితే తమకు నచ్చిన సీట్లను తీసుకొంటామని సురేఖ చెప్పారు. ఎవరి బలమేమిటో ప్రజలకు తెలుసునని ఆమె చెప్పారు. తమకు ప్రజా బలం ఉందని సురేఖ చెప్పారు.

కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం అబద్దం

కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం అబద్దం

కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారమంతా అబద్దమని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. తాము పార్టీ మారుతామని కెసిఆర్ నమ్మడం లేదన్నారు. టిఆర్ఎస్‌లో తమకు బాగానే ఉందని చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సురేఖ ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినా తమకు టిక్కెట్టు ఇవ్వకుండా తమపై దిగ్విజయ్ సింగ్ కు తప్పుడుగా సమాచారం ఇచ్చారని సురేఖ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+