అప్పుడే భానుడి భగభగలు.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్!
రాష్ట్రంలో అప్పుడే భానుడి భగభగలు ప్రారంభం అయ్యాయి. మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి. నిన్న ములుగు జిల్లా మంగపేటలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీల సెల్సియస్ పైన రికార్డయ్యాయి.
ఈ ఏడాది అధిక ఎండలను అంచనా వేసిన ఐఎండీ
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 2.2డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండటంతో అప్పుడే పగటిపూట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది అధిక ఎండలను అంచనా వేసింది.ప్రజలు ఎండలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత ఎండలు పెరుగుతాయి. కానీ ఈసారి తొలి వారంలోనే వేడి తీవ్రత మొదలైంది.

ఈ వారం సగటు ఉష్ణోగ్రతలిలా.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
ఈ వారంలో సగటు ఉష్ణోగ్రతలు 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని అధికారులు సూచించారు. ఇక నేడు ఆరు జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలే కాకుండా మిగిలిన 27 జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా. అయితే, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి జిల్లాల్లో 39.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.
ఉష్ణోగ్రత తక్కువున్నా వేడి తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్
మన చుట్టూ పెరిగిన కాలుష్యం కూడా ఎండ తీవ్రతలకు కారణంగా చెప్తున్నారు వాతావరణ శాఖాధికారులు. కాలుష్యమున్న చోట ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా వేడి ఎక్కువగా అనిపిస్తుందని చెప్తున్నారు.ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగినప్పటికీ, నాలుగు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని చెప్తున్నారు.ఎండల తీవ్రత నుంచి రక్షణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖాధికారులు సూచనలు చేస్తున్నారు. మధ్యాహ్నం బయట తిరగకుండా ఉండాలని, పుష్కలంగా నీరు తాగాలని సూచిస్తున్నారు.
-
విశ్వాసం అంటే ఇది.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేస్తే 130కి.మీ వెంట నడిచిన శునకం! -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications