Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు కురవకపోయినా.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా, హైదరాబాద్ వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది.మరో నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Weather update: next four days rain in telangana, alert these districts

శుక్రవారం నుంచి శనివా రం వరకు ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది.

కాగా, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సా యంత్రం వరకు రంగారెడ్డి జిల్లాలో 9 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 7 సెంటీమీటర్లు, మెదక్‌ జిల్లాలో 5 సెంటీమీటర్లు, వికారాబాద్‌ జిల్లాలో 5 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లాలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆగస్టు నెలలో దాదాపు వేసవిని తలపించేలా వాతావరణం ఉన్నప్పటికీ.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి కురిసిన వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తరచుగా కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో వర్షాలు పడుతుండటంతో పంటలు జీవం వచ్చిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+