తప్పించేంత తప్పు ఏంచేసారు.!అన్న నిన్ను మరువదు కాషాయ యువత అంటున్న బీజేపి క్యాడర్.!
హైదరాబాద్: బండి సంజయ్ కుమార్.. ఆ పేరుకు తెలంగాణలో రాజకీయాల్లో, యువతలో ఓ వినూత్న బ్రాండ్ ఉంది. ఆ పేరు చెబితే వైబ్రేట్ అయ్యే యూత్ కూడా ఉంది. బీజేపిలో పాదయాత్ర చేసిన తొలి నేతగా, మోదీ దేవుడన్నా అని గొంతు చించుకుని అరిసినా.. ఎందుకు తిట్టాలన్నా మోదీని అని ఎలుగెత్తి చాటినా, తెలంగాణ సీఎంను జైలుకు పంపించి తీరుతామని బల్ల గుద్ది చెప్పినా.. ఒక్క అవకాశం ఇవ్వండి బీజేపికీ అని వేడుకున్నా.. పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని గర్జించినా బండి సంజయ్ తర్వాతే అనేంత వరకూ పార్టీని ఉర్రూతలూగించారు బండి సంజయ్.
ఎందుకు తప్పించారో అర్ధం కావట్లేదంటున్న యువత : అంతే కాకుండా 6విడతలుగా ప్రజా సంగ్రామ పాద యాత్రతో ప్రజలకు బీజేపిని అత్యంత సన్నిహితంగా తీసుకెళ్లారు బండి సంజయ్. బండి సంజయ్ పాద యాత్రతో తెలంగాణలో పార్టీకి మంచి ఊపొచ్చిందనే చర్చ కూడా క్షేత్ర స్ధాయిలో చోటుచేసుకుంది. బండి సంజయ్ నేత్రుత్వంలో జరిగిన మూడు ఉప ఎన్నికలో రెండు చోట్ల పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా నగర పాలక సంస్ధ ఎన్నికల్లో 5 సీట్లు ఉన్న బీజేపి బండి సంజయ్ నేతృత్వంలో ఏకంగా 47 సీట్లను గెలుచుకుందంటే బండి సంజయ్ కృషి ఎంతుందో అర్థమవుతోంది.















Click it and Unblock the Notifications