పాతబస్తీలో రెచ్చిపోయిన వైట్‌నర్ గ్యాంగ్.. పోలీసులపై దాడి చేసిన రౌడీ లేడీస్..

హైదరాబాద్ : నగరంలో వెట్‌నర్ గ్యాంగ్ కలకలం సృష్టించింది. పాతబస్తీలోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో వైట్‌నర్ గ్యాంగ్ సభ్యులు రెచ్చిపోయారు. 12ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు మహిళలు పోలీసులకు చిక్కడంతో నానా హంగామా సృష్టించారు. అమ్మాయి తల్లితో పాటు ఏకంగా పోలీసులపైనా దాడి చేశారు.

వైట్‌నర్ మత్తులో లేడీ రౌడీస్

వైట్‌నర్ మత్తులో లేడీ రౌడీస్

తన కూతురిని వైట్‌నర్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిందన్న మహిళ ఫిర్యాదుతో ఫలక్‌నుమా పోలీసులు రంగంలోకి దిగారు. జాయిటూన్ మండి హోటల్ వద్ద వైట్‌నర్ మత్తులో ఉన్న నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించగా.. అక్కడ కిడ్నాప్‌కు గురైన బాలిక తల్లిని చూసిన నలుగురు కిడ్నాపర్లు రెచ్చిపోయారు. తమపై ఫిర్యాదు చేసినందుకుగానూ పోలీసుల ఎదురుగానే ఆమెను దారుణంగా కొట్టారు.

పోలీస్ స్టేషన్‌లో బీభత్సం

పోలీస్ స్టేషన్‌లో బీభత్సం

బాధిత మహిళపై దాడిని పోలీసులు అడ్డుకోబోవడంతో వైట్‌నర్ ముఠా పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా సృష్టించారు. పోలీసులపై దాడికి దిగారు. బూతులు తిడుతూ చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడి నుంచి పారిపోయారు.

ఆటోలపై దాడి

ఆటోలపై దాడి

వైట్‌నర్ మత్తులో పోలీస్ స్టేషన్‌ బయట రచ్చ చేసిన నలుగురు యువతులు పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆటోలు అడ్డురావడంపై వాటిపై ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన హంగామా అనంతరం పోలీసులు అతి కష్టమ్మీద రౌడీ లేడీస్‌ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్‌తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+