‘ఎన్టీఆర్.. అమిత్ షాను ఎందుకు కలవాలి?: జగన్‌ను చేర్చూకోవాలంటూ కేసీఆర్‌కు సూచన’
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్.. బీహార్ ముఖ్యమంత్రి సీఎం నితీశ్ కుమార్‌ను కలవడం మంచి పరిణామమిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
Recommended Video

ఆ కూటమిలోకి జగన్‌ను చేర్చుకోవాలంటూ కేసీఆర్‌కు సూచన
అంతేగాక, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా బీజేపీకి వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ పోరాటం చేస్తుందన్నారు.

అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కలిశారంటూ నారాయణ
తెలంగాణలో సినీ నటులను బీజేపీ ప్రసన్నం చేసుకుంటోందని.. వారి ద్వారా టీఆర్ఎస్‌ను బలహీన పర్చాలని చూస్తోందని నారాయణ ఆరోపించారు. సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి గొప్ప రాజకీయ చరిత్ర ఉందని, ఆయనకు కేంద్రమంత్రి అమిత్ షాను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు.జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, తాత చాలా మంచివారని.. అలాంటి మంచి ఫ్యామిలీ వ్యక్తి.. క్రిమినల్ అయిన అమిత్ షాను ఎందుకు కలిశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా పిలిచినా జూ.ఎన్టీఆర్ వెళ్లకుండా ఉండాల్సిందని నారాయణ అన్నారు.

అందుకే టీఆర్ఎస్ పార్టీకే సీపీఐ మద్దతు
తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని, ఇకపై తెలంగాణలో ఆ పార్టీ బీజేపీ ఆటలు సాగనివ్వబోమని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించామన్నారు. గుడిసెలు లేని తెలంగాణను కేసీఆర్ సర్కారు సాకారం చేయాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేయాలన్నారు. ట్రిపుల్ ఐటీకి శాశ్వత వీసీని నియమించాలని కోరారు. కాగా, సీపీఎం కూడా మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications