వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేసీఆర్‌కు ఏం ప్రమాదమని రూ.5కోట్ల అత్యాధునిక టెక్నాలజీ బస్సు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏం ప్రమాదం ఉందని రూ.5 కోట్లు పెట్టి అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సాంకేతికమైన బస్సును సొంతం చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు శుక్రవారం నాడు ప్రశ్నించారు.

వీ హనుమంత రావు ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీని వీడిన డీ శ్రీనివాస్ అంశంపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు డీఎస్‌ను అందరూ ఛీ అంటన్నారన్నారు.

డీఎస్ అవకాశవాది అన్నారు. ఆయన పార్టీ నుండి వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. తమ పార్టీకి పీడ విరగడయిందన్నారు. డీఎస్ ఎన్నికల్లో ఓడినప్పటికీ సోనియా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. అనేక పదవులు కట్టబెట్టారన్నారు.

అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ వీడటం సరికాదన్నారు. లలిత్ మోడీ వంటి అవినీతిపరులను ప్రధాని మోడీ కాపాడుతున్నారన్నారు. అవినీతి మంత్రులు, ప్రజా వ్యతిరేక పాలన పైన రాష్ట్రాల్లో ఆందోళన చేపట్టాలని తాను సోనియాకు విజ్ఞప్తి చేశానని చెప్పారు.

బస్సు

బస్సు

తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనల కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సు హైదరాబాదుకు వచ్చింది. జార్ఖండ్‌లో ఐదు కోట్ల రూపాయలతో ఈ బస్సును తయారు చేయించారు.

బస్సు

బస్సు

ఇందులో సెంట్రలైజ్ ఏసీతో పాటు బెడ్ రూం, బాత్ రూం, అధికారులతో మాట్లాడేందుకు చిన్న సమావేశపు హాల్, ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు బస్సు పైకి మెట్లు ఉన్నాయి.

బస్సు

బస్సు

బస్సుపై సీఎంతో పాటు ఇతర నేతలు, సెక్యూరిటీ నిలబడేలా అన్ని హంగులతో ముస్తాబయింది. లక్ష మందికి పైగా స్పష్టంగా వినబడేలా సౌండ్ సిస్టమ్ అమర్చారు. అంతేకాక, బస్సులో ప్రెస్ మీట్‌లు పెట్టుకోవచ్చు.

బస్సు

బస్సు

బస్సులో సెన్సార్లతో ఫైర్ సేఫ్టీ పరికరాలు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సెక్యూరిటీ అధికారులు ఉండేందుకు కేబిన్లు, హైకెపాసిటీ బ్యాటరీలు, జనరేటర్స్ ఉంటాయి. చండీగఢ్ మెర్సిడెడ్ బెంజ్ ప్రత్యేకంగా అత్యాధునిక సౌకర్యాలు కలిగిన టెక్నాలజీ బస్సును తయారు చేసింది.

వీహెచ్

వీహెచ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏం ప్రమాదం ఉందని రూ.5 కోట్లు పెట్టి అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సాంకేతికమైన బస్సును సొంతం చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు శుక్రవారం నాడు ప్రశ్నించారు.

English summary
'Why Telangana KCR buy costly bus for him?'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X