మోడీతో ఆ మాట మాట్లాడలేదేం: కేసీఆర్‌కు యాష్కీ ప్రశ్న, చంద్రబాబు పైనా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైకోర్టు విభజన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ పని ఎందుకు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆదివారం నాడు ప్రశ్నించారు.

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు హైకోర్టు విభజన అంశంపై ఒక్క మాట మాట్లాడలేదని ఆరోపించారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌తో చర్చించి హైకోర్టు విభజన చేసుకోవచ్చునని స్పష్టంగా ఉందన్నారు.

 'Why KCR did not talks about high Court in his Delhi tour'

అయినా దీని పైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించజారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా న్యాయవాదులు రోడ్డెక్కారని, న్యాయాధికారులను సస్పెండ్ చేశారని, అయినా సీఎంలు స్పందించలేదన్నారుత.

మోడీతో ఆ మాట మాట్లాడలేదేం: కేసీఆర్‌కు యాష్కీ ప్రశ్న
రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పైన చర్చించి, పరిష్కరించేందుకు వెంటనే అసెంబ్లీ, మండలి సమావేశాలని ఏర్పాటు చేయాలని మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అంతకుముందు రోజు డిమాండ్ చేశారు. రైతుల సమస్య, భూసేకరణ వంటి అంసాల పైన చర్చ కోసం అసెంబ్లీని సమావేశపర్చాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Why KCR did not talks about high Court in his Delhi tour, questions Congress senior leader Madhu yashki.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి