రాష్ట్రపతి ఎన్నికలు-విభజన కారణం: జగన్-కేసీఆర్‌లు ఇలా షాకిచ్చారు!
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతివ్వాలని ముందే నిర్ణయించుకున్న కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్, జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తాజాగా ట్విస్ట్ ఇచ్చాయి.
హైదరాబాద్/అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతివ్వాలని ముందే నిర్ణయించుకున్న కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్, జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాయి.
చదవండి: మాట్లాడేందుకు ప్రయత్నించాం, కానీ, మద్దతుకోసం కెసిఆర్ కు లేఖ: మీరాకుమార్
ఆరెస్సెస్ వాది, బిజెపి నేత అయిన రామ్‍నాథ్‌కు టిఆర్ఎస్, వైసిపిలు మద్దతివ్వడం సరికాదని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆరెస్సెస్ వ్యక్తికి జగన్ మద్దతివ్వడం సరికాదని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతుంటే, తెలంగాణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన మీరా కుమార్‌కు కేసీఆర్ మద్దతివ్వాలని టి కాంగ్రెస్ అంటోంది.

మాట్లాడకుండా జగన్, కేసీఆర్ పార్టీలు..
అయితే, వీరికి టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నాయి. తద్వారా కాంగ్రెస్ పార్టీని మాట్లాడలేని పరిస్థితుల్లోకి నెట్టివేసే ప్రయత్నాలు చేశాయి.

అందుకే మీరాను తీసుకొచ్చారు
ఎన్డీయేనే మొదట దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని, పైగా కేసీఆర్ సూచన మేరకు కూడా రామ్‌నాథ్ వంటి నేతను నిలబెట్టినట్లు స్వయంగా ప్రధాని మోడీ చెప్పారని తెరాస నేతలు అంటున్నారు. మోడీ దళిత నేతను నిలబెట్టిన తర్వాత విపక్షాలు కూడా కౌంటర్‌గా మీరా కుమార్‌ను తెరపైకి తెచ్చాయంటున్నారు.

సమాధానం ఏది?
అంటే మోడీ ఏ సామాజిక వర్గం నేతను నిలబెడితే, ఆ సామాజిక వర్గం నేతను నిలబెట్టాలనేది కాంగ్రెస్, విపక్షాల ఆలోచననా అని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ముందుగా తమను ఎందుకు సంప్రదించలేదని నిలదీస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నుంచి సమాధానం లేదని అంటున్నారు.

విభజన.. ఇదీ మా కారణం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తాజాగా కాంగ్రెస్ పార్టీకి మాట్లాడలేని కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర విభజనలో మీరా కుమార్ పాత్ర వహించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, విభజనలో పాత్ర పోషించిన వ్యక్తికి తాము ఎందుకు మద్దతివ్వాలని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు. టిఆర్ఎస్, వైసిపి నేతల ఎదురుదాడికి కాంగ్రెస్ వద్ద సమాధానం లేదని అంటున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications