వద్దన్నందుకు ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది!
హైదరాబాద్: వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరించినందుకు భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేసింది. రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో ఆదివారం నాడు ఇది చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం ఓ యువతితో పెళ్లైంది.
అయితే అతని భార్య మరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం భర్త దృష్టికి వచ్చింది. దీంతో అతను ప్రవర్తన మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు.

దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని భావించి భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే అతను హత్యగావించబడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, దానిని ఆత్మహత్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని అనంతగిరి కొండపై లారీ - ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో భార్య దుర్మరణం పాలవగా భర్త పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications