Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తనమాట వినటం లేదని భార్య ఘాతుకం; భర్తకు ఫుల్లుగా మద్యం తాగించి .. ఆపై ఏం చేసిందంటే

తాను చెప్పిన మాట వినడం లేదని భావించిన ఓ భార్య భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. నాలుగు ఎకరాల భూమిని తన పేరిట పట్టా చేయడం లేదని దారుణానికి తెగబడిన ఓ వివాహిత మధ్యలో పురుగుల మందు కలిపి భర్తకు తాగించి హతమార్చింది. శేరిపల్లి పెద్ద తండాలో వెలుగులోకి వచ్చిన ఈ దారుణం విషయానికి వస్తే

భార్యాభర్తల మధ్య ఘర్షణలు.. భర్తకు దూరంగా భార్య

భార్యాభర్తల మధ్య ఘర్షణలు.. భర్తకు దూరంగా భార్య

నల్లగొండ జిల్లా శేరిపల్లి పెద్ద తండా కు చెందిన రమావత్ మోతిలాల్, భార్యలతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె సంతానం. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్న క్రమంలో లలిత ఆరేళ్లుగా పిల్లలతో కలిసి హైదరాబాద్లోని గుర్రంగూడ లో నివాసం ఉంటూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. తనతో పాటు పిల్లలను కూడా తీసుకువెళ్లిన లలిత పిల్లలు పోషించుకుంటూ జీవిస్తుంది. ఇక మోతిలాల్ స్వగ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

నాలుగు ఎకరాల భూమి కోసం భార్యాభర్తల గొడవ .. భర్తను హతమార్చిన భార్య

నాలుగు ఎకరాల భూమి కోసం భార్యాభర్తల గొడవ .. భర్తను హతమార్చిన భార్య

భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడి వేరువేరుగా ఉంటున్నప్పటికీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. పిల్లలిద్దరూ తన దగ్గర ఉంటున్న కారణంగా వారిని పెంచాల్సిన బాధ్యత తనపై ఉందని, మోతిలాల్ పేర ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన పేరిట పట్టా చేయాలని కొంతకాలంగా లలిత మోతిలాల్ ను అడుగుతూ వచ్చింది. ఇక ఈ విషయంలో కూడా వారిద్దరు గొడవ పడుతున్నారు. అయితే ఇటీవల శేరిపల్లి పెద్దతండాలో బంధువులు శుభకార్యానికి హైదరాబాద్ నుంచి లలిత వచ్చింది. ఇదే అదునుగా భావించి మద్యంలో పురుగు మందు కలిపి భర్తకు తాగించింది. దీంతో ఫుల్ గా మద్యం తాగిన మోతిలాల్, అందులో పురుగు మందు ఉండటంతో మృతి చెందాడు.

మద్యంలో పురుగుల మందు కలిపి చంపానని ఒప్పుకున్న భార్య

మద్యంలో పురుగుల మందు కలిపి చంపానని ఒప్పుకున్న భార్య


ఇక గురువారం తెల్లవారుజామున లలిత తన భర్త మోతీలాల్ చనిపోయాడని భోరున విలపిస్తూ ఉండటంతో ఇరుగుపొరుగు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు. నిన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న మోతిలాల్ సడన్ గా ఎందుకు చనిపోయాడంటూ ప్రశ్నించారు. అతిగా మద్యం తాగి తన భర్త మోతిలాల్ మృతిచెందాడని లలిత వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే లలిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు గట్టిగా నిలదీయడంతో మద్యంలో పురుగుల మందు కలిపి హత్య చేసినట్లుగా లలిత అంగీకరించింది.

 వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని గ్రామస్తుల ఆరోపణ .. పోలీసులు కేసు నమోదు

వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని గ్రామస్తుల ఆరోపణ .. పోలీసులు కేసు నమోదు

హైదరాబాద్లో వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని, అందుకోసమే మోతిలాల్ ను మట్టు బెట్టింది అని శేరిపల్లి పెద్ద తండాకు చెందిన వారు ఆరోపిస్తున్నారు. ఇక భార్య భర్తను హతమార్చిన ఘటన సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మోతిలాల్ బంధువులకు అప్పగించారు. మృతుడి సోదరుడు శివరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. నేరాన్ని అంగీకరించిన లలితను పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.

 భర్తను హతమార్చిన భార్య జైలు పాలు .. అనాధలైన పిల్లలు

భర్తను హతమార్చిన భార్య జైలు పాలు .. అనాధలైన పిల్లలు

ఏది ఏమైనా, అవసరం ఏదైనా సరే భార్య భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తండా వాసులను నివ్వెరపరుస్తోంది. ఇక లలిత భర్తను హతమార్చటం వెనక ఆమె అడిగినట్టు నాలుగు ఎకరాల భూమిని తన పేరిట పట్టా చేయకపోవడం కారణమా?లేక గ్రామస్తులు ఆరోపిస్తున్నట్లు లలిత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండటం కారణమా? అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. లలిత చేసిన దారుణమైన పనికి భర్త మోతిలాల్ మరణించగా, ఆమె జీవితం జైలుపాలు కానుంది. వీరి సంతానం దిక్కు లేని వారైన పరిస్థితి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+