భర్తను బండతో మోదిన భార్య, బస్టాండ్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్: భర్త వేధిస్తుండటంతో, అతను నిద్రిస్తున్న సమయంలో బండరాయితో మోది హత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలోని ఎం.వెంకటాయపాలెంలో శుక్రవారం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
16 ఏళ్ల క్రిందట అన్వర్ (40), నజీరా బేగం (37)లకు వివాహామైంది.

ఇటీవల కాలంలో భర్త రోజూ తాగొచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విధేంపులకు విసుగు చెందిన ఆమె అన్వర్ పడుకున్న సమయంలో బండరాయితో నెత్తిమీద మోది హత్యాయత్నం చేసింది. దీంతో అతడి పరిస్ధితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Wife tries to murder her husband with big stone

హన్మకొండలో ఘర్షణ: బస్‌స్టేషన్‌ వద్ద 144 సెక్షన్

ఆర్టీసీ కార్మికుల సమ్మె వరంగల్ జిల్లాలోని హన్మకొండ బస్టాండ్‌లో ఉద్రిక్త పరిస్థిత నెలకొంది. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లోకి వెళ్లేందుకు కార్మికులు యత్నించారు. దీంతో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

ఈ ఘర్షణలో హన్మకొండ డిపో వద్ద కార్మికులు బారికేడ్లు ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో 15 మంది మహిళా కండక్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వరంగల్ జిల్లాలోని తొమ్మిది బస్టాండ్‌ల పరిధిలో 144 సెక్షన్ విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+