మోడీని కేసీఆర్ ఎందుకు అడగట్లేదు, ఏపీకి హోదా ఇస్తాం: రాహుల్
హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోడీ, తెలంగాణలో కేసీఆర్ మాటలు ఒకేలా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షులా రాహుల్ గాంధీ సోమవారం ఎద్దేవా చేశారు. జనాన్ని మోసం చేయడంలో ఇద్దరూ ఇద్దరే అన్నారు. తెలంగాణలో ఒకే కుటుంబం పెత్తనం సాగిస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో స్పష్టమైన హామీలు ఇచ్చామని చెప్పారు.
Recommended Video

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వకపోయినా కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సినని, రావాల్సినవి రాలేదన్నారు. కానీ కేసీఆర్ అడగని విమర్శించారు.
నోట్ల రద్దుతో ప్రధాని మోడీ మోసం చేశారన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత, ఆదివాసీ రైతులను కేసీఆర్ నిండా ముంచారన్నారు. తెలంగాణలో 4వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

యుద్దవిమానాలు తయారు చేసే పరిజ్ఞానం ఉన్నా ఫ్రాన్సుతో రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాఫెల్ పైన దేశంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పారు. అనిల్ అంబానికి లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. రాఫెల్ డీల్ పైన మోడీని సూటిగా ప్రశ్నించానని, కానీ ఆయన తన కళ్లలోకి సూటిగా చూడలేకపోయారన్నారు. తప్పు చేసిన వారు సూటిగా చూసి మాట్లాడలేరన్నారు. రాఫెల్ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని విమర్శించారు. ప్రజల కోసం విమానాలు కొంటారని, కానీ ప్రజలకు మాత్రం వివరాలు చెప్పరన్నారు.
ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేస్తామని ప్రధాని మోడీ చెబుతారని, ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూం అని కేసీఆర్ చెబుతారని, కానీ హామీలు నెరవేర్చరన్నారు. ఇద్దరివీ మోసపూరిత హామీలే అన్నారు. నేను ప్రధానిని కాదు కాపలాదారుడిని అని మోడీ చెబుతారని కానీ అన్నీ అవాస్తవాలే అన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు అని చెప్పారని, కానీ నాలుగేళ్లలో కనీసం 10వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.












Click it and Unblock the Notifications