ప్రియ ప్రకాశ్ వారియర్ సినిమా: 'ఒక్క సన్నివేశం తొలగించం, అలాంటిదేమీ లేదు'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఒరు అదర్ లవ్ సినిమాపై హైదరాబాదులో ఫిర్యాదు నేపథ్యంలో ఆ సినిమా సంగీత దర్శకులు షాన్ రెహ్మాన్ స్పందించారు. తాము చిత్రీకరించిన పాటలో ఎలాంటి అభ్యంతరకరమైన పదాలు వాడలేదని స్పష్టం చేశారు.

చదవండి: అదే మంచిది: హైదరాబాదులో ఫిర్యాదుపై హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్

  Priya Warrior Expression Goes Viral, Star Heros 'Fidaa'

  కొన్ని దశాబ్దాల నుంచి కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పాటను ముస్లీంలు కూడా పాడుకుంటున్నారని చెప్పారు. అప్పటి నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

  చదవండి: ప్రియ వారియర్ కనుసైగలకు ఫిదా, ఎవరీమె? యువత గుండె పిండేస్తున్న వీడియో

  ఒక్క సీన్ కూడా తొలగించం

  ఒక్క సీన్ కూడా తొలగించం

  తన పాటలో ఎలాంటి అభ్యంతరకరమూ లేదని దర్శకులు స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలు కించపరిచేలా ఏమీ లేదన్నారు. తమకు సమాజం నుంచి మంచి మద్దతు వస్తోందన్నారు. అవసరమైతే తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. సినిమాలో ఏ సన్నివేశాన్ని తొలగించేది లేదని చెప్పారు.

  హావాభావాల్లో అసభ్యత లేదు

  హావాభావాల్లో అసభ్యత లేదు

  ఇంతకుముందే, నటి ప్రియ కూడా స్పందించారు. ఆ కేసు గురించి తనకు తెలియదని, దర్శకులు చెప్పింది చేశానని చెప్పారు. తన హావాభావాల్లో అసభ్యత లేదని, దీనిని అనవసరంగా వివాదం చేస్తున్నారని చెప్పారు.

  కేసు నమోదు చేసి దర్యాఫ్తు

  కేసు నమోదు చేసి దర్యాఫ్తు

  కాగా, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నందున దర్శకులు, హీరోయిన్ పైన చర్యలు తీసుకోవాలని హైదరాబాదులో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ పాటలో వాడిన పదాలు ముస్లీంల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆ సినిమా దర్శకులు ఉమర్ లులూపై ఫలక్ నుమా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసలు ఉమర్ లులూపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

  రొమాంటిక్ సన్నివేశంలో ఎలా పెడతారు

  రొమాంటిక్ సన్నివేశంలో ఎలా పెడతారు

  మహమ్మద్ ప్రవక్తకు చెందిన లిరిక్‌ను రొమాంటిక్ సన్నివేశంలో పెట్టడం సరికాదని వారు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 295 కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు పత్రంపై 57 మంది వరకు సంతకం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Priya Prakash Varrier, whose wink in 'Manikya Malaraya Poovi' song from her upcoming film Oru Adaar Love, has made her an overnight internet sensation is now landed into some legal trouble.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X