ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్‌కు పొంగులేటి షాక్ ఇస్తారా? కుమార్తె పెళ్లిరిసెప్షన్ లో ఏం జరిగింది? హాట్ డిబేట్!!

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇవ్వనున్నారా? త్వరలో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారా? కుమార్తె సప్ని రెడ్డి వివాహ వేడుకల్లో బిజీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఈ వార్తలు బయటకు రావడానికి కారణం ఏమిటి? పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలలో జరిగిందేమిటి అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

 టీఆర్ఎస్ కు పొంగులేటి షాక్ ? అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిక ?

టీఆర్ఎస్ కు పొంగులేటి షాక్ ? అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిక ?


ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పై చాలా కాలంగా అసహనంతో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి బీజేపీలో చేరతారని, మునుగోడు లో జరగనున్న సభలో ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టిన కమలం పార్టీ ఇప్పటికే పలువురు కీలక నేతలను, పార్టీలో చేర్చుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. మునుగోడు లో జరగనున్న అమిత్ షా సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోపాటు మరికొందరు కీలక నేతలు పార్టీలో చేరతారని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.

పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్ లో కనపడని టీఆర్ఎస్ ముఖ్యనేతలు

పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్ లో కనపడని టీఆర్ఎస్ ముఖ్యనేతలు


ఇక ఈ సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారు అన్న టాక్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరుతారు అన్న వార్తలకు నిన్న జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ మరింత ఊతం ఇచ్చింది. ఖమ్మంలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ వేడుకలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ కనిపించకపోవడం అందుకు ప్రధాన కారణంగా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు లక్షలాది మంది అతిథులు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ హాజరు కాలేదు.

పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈటల రాజేందర్

పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈటల రాజేందర్


అత్యంత ఘనంగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ను నిర్వహిస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ ఆ రిసెప్షన్ కు హాజరు కావడానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం పార్టీకి ఆయనకు మధ్య ఉన్న గ్యాప్ ను స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తో పాటు పలువురు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఇక బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఈటల రాజేందర్ రాక.. గులాబీ నేతలు రాకపోవటం వెనుక రీజన్ పొంగులేటి బీజేపీ బాట?

ఈటల రాజేందర్ రాక.. గులాబీ నేతలు రాకపోవటం వెనుక రీజన్ పొంగులేటి బీజేపీ బాట?


టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా సొంత పార్టీ నాయకులు ఎవరూ రాకపోవడం, బీజేపీ లో చేరిక కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ రిసెప్షన్ కు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కారణంగా మారింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో ఈటల రాజేందర్ కు ఉన్న సాన్నిహిత్యం చూసి ఆయన బీజేపీలోకి వెళ్తున్నారు అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఈ కారణంగానే టిఆర్ఎస్ పార్టీ నేతలెవరూ పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరు కాలేదన్న టాక్ వినిపిస్తోంది. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారా? లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

English summary
As none of the TRS party leaders attended the wedding reception of Ponguleti Srinivasa Reddy's daughter and BJP MLA Etela Rajender was the main attraction, there is talk that Ponguleti Srinivasa Reddy will shock the TRS and join the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X