మేక్ ఏ విష్: 8 ఏళ్ల బాలుడు ఒక్కరోజు హైదరాబాద్ కమిషనర్ (పిక్చర్స్)

హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నాడు ఒక్కరోజు కమిషనర్‌గా చిన్నారి రూప్ అరౌణ సందడి చేశారు.

రూప్ అరౌణ తలసేమియాతో బాధపడుతున్నాడు. రెండో తరగతి చదువుతున్న ఇతని వయస్సు ఎనిమిదేళ్లు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన చిన్నారి.

రూప్ అరౌణకు పోలీస్ కమిషనర్ కావాలనే కోరిక ఉంది. అతని కోరిక తెలుసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి.. మంగళవారం దానిని నెరవేర్చారు.

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన విక్రమ్, రంజిత దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు రూప్ రెండో తరగతి చదువుతున్నాడు.

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

మూడేళ్ల వయస్సులో జెనెటిక్స్ బ్లడ్ డిజార్డర్‌తో ఆ ఎనిమిదేళ్ల బాలుడికి తలసేమియా వ్యాధివచ్చినట్లు నిర్ధారించారు.

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ప్రతి మూడు వారాలకోసారి బాలుడికి రక్తమార్పిడి చేయాల్సి ఉండడంతో పాతబస్తీలోని పురానహవేలీలో ఉన్న తలసేమియా అండ్ సికెల్ సెల్ సొసైటీలో రూప్‌ను సభ్యునిగా చేర్చారు. అతనికి క్రమం తప్పకుండా సరైన మందులు, డైట్ ఇస్తూ వైద్య పరీక్షలు, రక్తమార్పిడి చేయిస్తున్నారు.

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

విషయం తెలిసిన... మేక్ ఏ విష్ సంస్థ వాలంటీర్లు రూప్‌ను కలిసినపుడు తనకు నగర పోలీస్ కమిషనర్ కావాలని ఉందని చెప్పాడు. గత సంవత్సరం కరీంనగర్ జిల్లాకు చెందిన సాదిక్ అనే బాలుడు ఇలాంటి కోరికే కోరితే తీర్చారు.

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఇప్పుడు రూప్ కోరికను తీర్చేందుకు మేక్ ఏ విష్ ప్రతినిధులు నగర కమిషనర్‌ను సంప్రదించగా ఆయన అందుకు సమ్మతించారు. మంగళవారం ఆ బాలుడి కోరిక తీర్చి, అతని ఆరోగ్యం, భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పుష్పదేవి జైన్ మాట్లాడుతూ... గత సంవత్సరం సాధిక్ అనే బాలుడి కోరికను తీర్చడంతో అతడి ఆరోగ్యం కుదుటపడిందన్నారు. ఇలాంటి బాధితులు మరికొందరు ఉన్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సినిమా హీరోలు మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారిని వారు కలుసుకోవాలని కోరుకుంటున్నారని చెప్పారు.

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఆ పిల్లల కోర్కె తీర్చేందుకు వారివారి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో అదనపు కమిషనర్ అంజనీ కుమార్, బాలుడి తండ్రి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

ఒక్కరోజు పోలీస్ కమిషనర్

పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... చిన్నారి కమిషనర్‌ను అభినందించారు. రూప్ ఒక్కరోజు కమిషనర్ కావాలనే కోరికను మేక్ ఏ విష్ సంస్థ నిర్వహకురాలు డాక్టర్ పుష్పాదేవి జైన్ తన వద్దకు తీసుకు వచ్చారన్నారు. గతేడాది సాధిక్‌కు అవకాశం కల్పించామని, అతను ఆరోగ్యంతో ఉన్నాడని, ఆ స్ఫూర్తితోనే మళ్లీ ఇలా చేశామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+