వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: వదినపై అత్యాచారం, హత్య: వరకట్న వేధింపులకు మరొకరు బలి

బహిర్భూమికి వెళ్ళిన మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గంగారం గ్రామంలో సంచలనం సృష్టించింది.

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి: బహిర్భూమికి వెళ్ళిన మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గంగారం గ్రామంలో సంచలనం సృష్టించింది. కారం పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మారుపాక మణెమ్మ(36)కు 15 ఏళ్ల క్రితం నస్తూర్‌పల్లికి చెందిన వ్యక్తితో వివాహమైంది. భర్త ప్రవర్తన నచ్చకపోవడంతో కొంతకాలంగా గంగారంలోని తల్లిగారింట్లోనే నివాసముంటోంది. మణెమ్మ చెల్లెలు రజిత కూడా తన భర్తతో కలిసి అక్కడే నివాసముంటున్నారు.

ఈ క్రమంలో రజిత భర్త సమ్మయ్య కన్ను వదినపై పడింది. కొద్దిరోజులుగా తన కోరిక తీర్చాలని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి మణెమ్మ ఊరు పొలిమేరకు బహిర్భూమికి వెళ్తున్న క్రమంలో సమ్మయ్య ఆమెను వెంబడించాడు. తన కోరిక తీర్చాలని బలతంతంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తుల సహకారంతో ఆదివారం రాత్రి నిందితుడు సమ్మయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ తెలిపారు.

వరకట్న వేధింపులకు ఒకరు బలి

పెద్దపల్లి: కమాన్‌పూర్‌ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన తిరుమల లక్ష్మి (21) అనే వివాహిత యువతి అత్తింటి వరకట్న వేధింపులు భరించలేక సోమవారం సాయంత్రం ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కమాన్‌పూర్‌ ఎస్‌ఐ ఆది మధుసూదన్‌రావు తెలిపారు.

కమాన్‌పూర్‌ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు... గుండారం గ్రామానికి చెందిన లక్ష్మిని అదే గ్రామానికి చెందిన తిరుమల కుమార్‌కు ఇచ్చి గత సంవత్సరం క్రితం వివాహం జరిపించారు. వివాహ సమయంలో బంగారంతో కలిపి రూ. నాలుగు లక్షల కట్నం ఒప్పుకోగా, రూ.మూడు లక్షల కట్నం తల్లిదండ్రులు ముట్టజెప్పారు.

 A woman allegedly raped and murdered in gangaram

మిగిలిన రూ. లక్ష కట్నం తీసుకురావాలని లక్ష్మిని భర్త కుమార్‌, మామ ఓదెలు, అత్త లక్ష్మి, మరిది శ్రీకాంత్‌లు గత కొంత కాలంగా నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక చివరకు వివాహిత యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకుని సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ పుప్పాల హనుమంతరావు, ఎస్‌ఐ మధుసూదన్‌రావు, హెడ్‌ కానిబుల్‌ రవీందర్‌లు పరిశీలించి.. లక్ష్మి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు లక్ష్మి భర్త, అత్త, మామ, మరిదిలపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. యువతి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు

దంపతుల ఆత్మహత్య

ఖమ్మం: పెళ్లయి మూణ్నెళ్లయినా కాలేదు. ఓ యువ దంపతుల మధ్య ఆర్థిక, మానసిక సంఘర్షణ తలెత్తింది. దీంతో ఉదయాన్నే భార్య ఉరేసుకోవడం.. అది చూసిన నిమిషాల వ్యవధిలోనే భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం ఇరు కుటుంబాలను తీరని విషాదంలో నింపింది. ఈ సంఘటన ఖమ్మం నగరంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

ఖమ్మం నగరంలోని పాకబండవీధికి చెందిన యర్రం నాగ ప్రసాద్‌రెడ్డి(35), గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన వంగూరి ఉమా(24)కు మూడు నెలల క్రితం వివాహమైంది. వీరిది కులాంతర వివాహం. ఒకరికొకరు ఇష్టపడి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఉమా చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటోంది.

వడ్డీ వ్యాపారం చేసే ప్రసాద్‌రెడ్డికి ఆమెతో పరిచయం కావడం.. అది కాస్తా ఇష్టంగా మారడంతో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారం కారణంగా నవ దంపతులకు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. దీంతో వారు మానసిక సంఘర్షణకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉమా ఇంట్లోని పై అంతస్తు గదిలో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఆ సమయంలో ప్రసాద్‌రెడ్డి కింద గదిలో ఉన్నాడు. ఉమా ఉరివేసుకున్న విషయాన్ని మేనల్లుడి ద్వారా తెలుసుకున్న అతడు వెంటనే పైకెళ్లి చూశాడు. ఉమ విగతజీవిగా కనిపించింది. అది చూసి మానసిక ఒత్తిడికి గురైన ప్రసాద్‌రెడ్డి సమీపంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో విజయవాడ నుంచి వరంగల్‌ వైపు వెళ్లే రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నిమిషాల వ్యవధిలో యువ జంట ఆత్మహత్య చేసుకోవడంతో బాధిత కుటుంబాల్లో, స్థానికంగా విషాదం నెలకొంది. ఇదిలా ఉండగా ప్రసాద్‌రెడ్డి తండ్రి నెల రోజుల కిందటే అనారోగ్యం కారణంతో మృత్యువాత పడ్డాడు. ఉమా మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అమ్మమ్మ సంగమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఒకటో పట్టణ ఎస్సై రాజు తెలుపగా, ప్రసాద్‌రెడ్డి మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై నరేశ్‌ తెలిపారు.

English summary
A man allegedly raped and murdered his sister-in-law at Gangaram village in Kataram mandal on Sunday late evening hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X