షాక్: అమ్మాయిల నగ్నచిత్రాలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:అమ్మాయిల నగ్న చిత్రాలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తోన్న ఓ యువతిని పోలీసులు సోమవారం నాడు అరెస్టు చేశారు. తనతో పాటు తన రూమ్ లో ఉంటున్న యువతుల నగ్న చిత్రాలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తోందని బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితురాలు విజయను ఆమెకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

కూకట్ పల్లి కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలోని ఓ లేడీస్ డీలక్స్ హస్టల్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.విజయ అనే మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ హస్టల్ లో ఉంటోంది. ఆమె గత కొంత కాలంగా తనతో పాటు రూమ్ లో ఉంటున్న యువతులను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీస్తోంది.

woman arrested for blackmailing in hyderabad

ఈ ఫోటోలను తాను పనిచేసే కంపెనీ యజమాని శివయ్యకు వాట్సాప్ లో పంపించేది. ఆ తర్వాత ఆ యువతులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు.దీంతో బాధితులు విజయపై కెపిహెచ్ బి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.విజయతో పాటు ఆమెకు సహకరించిన శివయ్యను కూడ పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman arrested for blackmailing roommates with nude photos in hyderabad on monday.
Please Wait while comments are loading...