కుమారుడిని అమరుడిగా గుర్తించాలని మహిళ ఆత్మహత్యాయయత్నం (ఫొటో)
ఖమ్మం: తన కుమారుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని అమరుడైనా ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపిస్తూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళ ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నల్గొండ జిల్లా మునగాల మండలం రెపాల గ్రామానికి చెందిన సుగుణమ్మ తన కుమారుడు సుధాకర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పోత్ర పోషించాడని ఆమె చెప్పింది,
సకలజనుల సమ్మె తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె చెప్పింది. పంచాయతీరాజ్‌శాఖలో ఉద్యోగిగా ఉన్న కుమారుడిపైనే కుటుంబం ఆధారపడి ఉందని, కనీసం అమరవీరుడిగా కూడా ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని చెప్పిది.
ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన అనంతరం డొమెక్స్ సిరప్‌లో ఎండ్రిన్ కలుపుకొని తాగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

సుధాకర్ రెడ్డిని ఖమ్మం జిల్లా తరఫున అమరవీరునిగా ప్రభుత్వం గుర్తించింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నిర్ణయించింది. సుధాకర్‌రెడ్డికి పెళ్లి కావడంతో ఆయన భార్యకు లబ్ధి చేకూరుతుందని అధికారులు సమాచారమిచ్చారు. దీంతో సుధాకర్‌రెడ్డి తల్లి, ఆమె కోడలు కుటుంబాల మధ్య ఆ విషయమై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఖమ్మం పరేడ్ మైదానంలో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడులకు సుగుణమ్మ హాజరైంది.
మైదానంలో పతాకావిష్కరణ అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసింది. కుమారునికి అందే పరిహారం తనకు అందజేయాలని, కోడలు పట్టించుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన మంత్రి ఈ విషయాన్ని పరిశీలించాలని పక్కనే ఉన్న కలెక్టర్ లోకేశ్‌కుమార్‌ను సూచించారు.
సుగుణమ్మ ఆత్మహత్యయత్నం పాల్పడడాన్ని గమనించిన ఖమ్మం నగరానికి చెందిన సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు బృందం, పోలీసు జీపు డ్రైవర్ నర్సింహారావు హుటాహుటిన పోలీసు వాహనంలో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన పేరు, ఇతర వివరాలు తెలిపిన సుగుణమ్మ అపస్మారక స్థితికి చేరింది.
2011లో తెలంగాణ సకల జనుల సమ్మె సందర్భంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డు వద్ద నల్గొండ జిల్లాకు చెందిన పంచాయతీ సెక్రటరీ రావు సుధాకర్‌రెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుధాకర్‌రెడ్డి భార్య శకుంతల మునగాల మండలం ముకుందాపురం జడ్పీఎస్‌ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు (వయసు 13, 11) ఉన్నారు. పెద్ద కుమారుని మానసిక స్థితి అంతంతమాత్రం కావడంతో అతడు మేజర్ అయ్యాక ఉద్యోగ అవకాశం కల్పించాలని శకుంతల విజ్ఞప్తి మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
2015, ఏప్రిల్ 15న రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ఆమెకే అందజేశారు. ఉద్యోగం, పరిహారం రెండూ తన కోడలికే ఇవ్వాలని నిర్ణయించడంతో సుధాకర్‌రెడ్డి తల్లి సుగుణమ్మ బాధపడ్డారు. కుమారుడు చనిపోయాడని, కోడలు పట్టించుకోవటం లేదని అంటూ నిరుపేద అయిన తన చిన్న కుమారునికి ఉద్యోగం ఇవ్వాలని ఆమె కోరుతోంది. ఇదే విషయమై ఆవిర్భావ వేడుకల్లో మంత్రి, కలెక్టర్‌కు విన్నవించుకుంది. నిబంధనల గురించి అధికారులు తెలపడంతో మనస్తాపం చెందిన సుగుణమ్మ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications