కూతురుతో అపార్టుమెంట్ నుంచి దూకి ఆత్మహత్య, భర్త వాదన..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాచిగూడలో శుక్రవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. మిరానికేతన్‌ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి రెండేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఐశ్వర్య(35), కూతురు ఆరాధ్య(2)గా గుర్తించారు.

కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. పోలీసులు భర్త రవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

భర్త రవి ఓ జ్యువెల్లరీ దుకాణంలో పని చేస్తున్నాడు. తన భార్య మానసిక పరిస్థితి కొద్ది రోజులుగా బాగా లేదని అతను పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది. మరోవైపు, ఐశ్వర్య కుటుంబ సభ్యులు అపార్టుమెంట్ వద్ద ఆందోళనకు దిగారు.

అన్నెం పున్నెం ఎరుగని పాప

అన్నెం పున్నెం ఎరుగని పాప

ఆస్తి తగాదాలకు, అత్తింటివారి వేధింపులకు తల్లితో పాటు బలైన అన్నెంపున్నెం ఎరుగని 16 నెలల పాప గీతాంజలి ఇలా పడిపోయింది.

పోలీసులు దర్యాప్తు...

పోలీసులు దర్యాప్తు...

కాచిగూడా ప్రాంతంలోని ఓ అపార్టుమెంటు పదో అంతస్థు నుంచి మహిళ, ఆమె కూతురు పడి మరణించిన సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

తీవ్ర మానసిక క్షోభకు గురై..

తీవ్ర మానసిక క్షోభకు గురై..

తీవ్రమానసిక క్షోభకు గురైన రేణుక శుక్రవారం ఉదయం తాను ఉంటున్న పదో అంతస్తుపైకి వెళ్లి ముందుగా తన బిడ్డను కిందికి తోసేసి ఆ వెంటనే ఆమె కూడా దూకింది. తల్లిబిడ్డ ఇద్దరూ రక్తం మడుగులో అక్కడికక్కడే మృతిచెందారు.

వేధింపులే కారణం...

వేధింపులే కారణం...

ఆస్తి తగాదాలు, అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ గృహిణి రేణుక, తన 16 నెలల బిడ్డతోకలిసి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది.

అద్దెకు దిగారు....

అద్దెకు దిగారు....

రవి, రేణుక దంపతులకు గీతాంజలి (16 నెలలు) కూతురు ఉన్నది. కొంతకాలంగా ఉప్పుగూడ శివాజీనగర్‌లో ఉన్న వీరికి కుటుంబంలో గొడవలు రావడంతో 20 రోజుల క్రితం కాచిగూడ కుద్బీగూడలోని మీరానికేతన్ అపార్ట్‌మెంట్ పదో అంతస్తులో అద్దెకు దిగాడు.

రేణుకపై ఫిర్యాదు చేశారు..

రేణుకపై ఫిర్యాదు చేశారు..

రవి బషీర్‌బాగ్‌లోని దుర్గా జువెల్లర్స్‌లో పనిచేస్తున్నాడు. రేణుక(32)ను ఆస్తి విషయంలో అత్త దమయంతితోపాటు తోటికోడలు, మరుదులు వేధింపులకు గురిచేశారు. ఇటీవల వారు చత్రినాక పోలీస్టేషన్‌లో రేణుకపై ఫిర్యాదు చేశారు.

తల్లీబిడ్డల మృతితో...

తల్లీబిడ్డల మృతితో...

తల్లిబిడ్డులు అత్యంత దారుణంగా పదో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తరఫు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

విషాద సంఘటన..

విషాద సంఘటన..

తల్లీబిడ్డలు పదో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అందరి హృదయాలను కదిలించి వేసింది.

పోలీసులు సంఘటనా స్థలాన్ని....

పోలీసులు సంఘటనా స్థలాన్ని....

పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు. అక్కడి వారిని వారు విచారించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Woman commits suicide in Kachiguda on Friday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి