మహిళ దారుణ హత్య: వివాహేతర సంబంధమే కారణం?
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. డీఆర్‌డీఎల్ వెనుక ఉన్న చెట్ల పొదల్లో మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతురాలిని ఎల్లమ్మ(40)గా పోలీసులు బుధవారంనాడు గుర్తించారు.

ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. అయితే ఎల్లమ్మ అదృశ్యమైనట్లు మంగళవారం మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎల్లమ్మ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కలుషిత ఆహారంతో ఆస్వస్థత
హైదరాబాదు నగరంలోని మలక్‌పేట సలీమ్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానిక విద్యాధికారులు విచారణ చేపట్టారు.

బెట్టింగ్ ముఠా అరెస్టు
హైదరాబాదులో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 మొబైల్ ఫోన్లు, రూ.19వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications