వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడుక్కుతినేవాళ్ళు కూడా ఈ చీరలు కట్టరు; బతుకమ్మ చీరలు తగలబెట్టిన మహిళలు; వీడియో వైరల్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందజేస్తున్న బతుకమ్మ చీరలపై మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా పండుగకు ఇటువంటి చీరలు కట్టుకుంటారా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల అయితే బతుకమ్మ చీరలను తగలబెడుతున్న మహిళలు కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.

మహబూబాబాద్ లో బతుకమ్మ చీరలు తగలబెట్టిన ఘటన

తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం లో బతుకమ్మ చీరలను మహిళలు దగ్ధం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో నడిరోడ్డుపై బతుకమ్మ చీరలను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఒక మహిళ కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. రోజువారి కూలి పని చేసుకున్నప్పటికీ తాము మంచి చీరలు కట్టుకుంటామని, కానీ పండుగకు ఇటువంటి నాసిరకం చీరలు ఎందుకు పంపిణీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

బతుకమ్మ చీరలపై మహిళల ఆగ్రహం .. వీడియో పోస్ట్ చేసిన కాంగ్రెస్

బతుకమ్మ చీరలపై మహిళల ఆగ్రహం .. వీడియో పోస్ట్ చేసిన కాంగ్రెస్

ఇలాంటి చీరలు కెసిఆర్ భారీ కట్టుకుంటుందా, కెసిఆర్ కుమార్తె కవిత కట్టుకుంటుందా చెప్పాలని నిలదీశారు. వాళ్ళను కట్టుకోమనండి .. మేమూ కట్టుకుంటాము అంటూ పేర్కొన్నారు. అడుక్కుతినే వాళ్ళు కూడా ఈ చీరలు కట్టుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళలను కెసిఆర్ తన అహంకారంతో అగౌరవ పరుస్తున్నారు అని, మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చి పండుగ చేసుకోమని చెబుతున్నారని ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోను తెలంగాణ సీఎంఓ కు , టీఆర్ఎస్ పార్టీకి ట్యాగ్ చేసి బతుకమ్మ చీరల పేరుతో మీరు చేస్తున్న నిర్వాకం ఇది అని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

బతుకమ్మ చీరలు తగలబెడితే కఠిన చర్యలన్న ఎర్రబెల్లి .. అయినప్పటికీ మహిళల అసహనం

బతుకమ్మ చీరలు తగలబెడితే కఠిన చర్యలన్న ఎర్రబెల్లి .. అయినప్పటికీ మహిళల అసహనం

ఇదిలా ఉంటే ఇప్పటికే బతుకమ్మ చీరల పంపిణీ సమయంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ చీరలు నచ్చకపోతే తీసుకోవద్దని, ఒకవేళ ఎవరైనా బతుకమ్మ చీరలు తీసుకొని వాటిని తగలబెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బతుకమ్మ చీరలు నచ్చలేదని తీసుకోని వారు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా తీసుకోకుండా ఉండాలని, ఆసరా పెన్షన్ లు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు తీసుకోకూడదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయినప్పటికీ బతుకమ్మ చీరల విషయంలో మహిళల అసహనం అనేక జిల్లాలలో కనిపిస్తుంది. మరి చీరలు తగలబెడుతున్న ఘటనలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

English summary
In Garla Mandal of Mahabubabad district, women burnt bathukamma sarees and slams trs govt, even beggars don't wear these sarees and the video goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X