year ender 2024: ఈ ఏడాది వివాదాలు, పోలీస్ కేసుల్లో చిక్కుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు!

మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు సద్దుమణగలేదు. రోజురోజుకీ గొడవలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి కేసులు 2024 సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మందికి కలిసి రాలేదని చెప్పాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఊహించని విధంగా వివాదాల్లో చిక్కుకోవడం, ఎఫైర్స్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవడం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం, జైళ్లకు వెళ్లవలసిన రావడం, పరువు నష్టం దావాలు వేయటం వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.

రాజ్ తరుణ్ లావణ్య కేసు
ఇక 2024 సంవత్సరంలో టాలీవుడ్ లో యంగ్ హీరో రాజ్ తరుణ్ పైన లావణ్య అనే యువతి తనను ప్రేమించి కొన్నిళ్ళు వాడుకొని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెలరోజుల పాటు వారి రచ్చ కొనసాగింది. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న పోలీసులు రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చి, ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

year ender 2024 These Tollywood celebrities in controversies and police cases this year

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు
ఇక టాలీవుడ్ లో మంచి కొరియోగ్రాఫర్ గా పేరు ఉన్న జానీ మాస్టర్ పైన ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న మహిళ తనపైన మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారని ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదుచేసి, అరెస్టు చేసి జైలుకు పంపించారు. జాతీయ అవార్డును కూడా ఆయన కోల్పోవాల్సి వచ్చింది.

పోలీస్ కేసుల దాకా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు
ఇక టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీ గా పేరుపొందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఆస్తి తగాదాలతో రోడ్డెక్కింది. మంచు మనోజ్ తన తండ్రి పైన, తన సోదరుడు పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక తన కుమారుడు పైన మంచి మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేశాడు. మంచు కుటుంబ కలహాలను కవర్ చేస్తున్న ఓ జర్నలిస్టు పైన మోహన్ బాబు దాడి చేయడంతో ఆయన పైన హత్యాయత్నం కింద కేసు నమోదు అయింది. పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు.

పరువు నష్టం దావా వేసి న్యాయ పోరాటం చేస్తున్న అక్కినేని నాగార్జున
నాగచైతన్య సమంతల విడాకులకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడంతో, ఈ అనుచిత వ్యాఖ్యలపైన నాగార్జున కుటుంబం సీరియస్ అయింది. మంత్రి కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేసి ఆమెతో లీగల్ గా అక్కినేని నాగార్జున ఫైట్ చేస్తున్నారు. హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపైన న్యాయ పోరాటం చేస్తున్నారు.

year ender 2024 These Tollywood celebrities in controversies and police cases this year

రాం గోపాల్ వర్మపై కేసులు
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కేసులు నమోదు కావడం రాంగోపాల్ వర్మ పోలీసులు అరెస్టు చేస్తారని ఆందోళనతో అజ్ఞాతంలో ఉన్నారు. గతంలో చంద్రబాబుపైన, పవన్ కళ్యాణ్ పైన, నారా లోకేష్ పైన ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ వేదికగా అనుచిత పోస్టులు చేసిన ఆయనపైన అనకాపల్లి, తుళ్లూరు తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

జైలు కెళ్ళిన అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల
ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లి ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనతో పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసి ఇటీవల ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, చంచల్ గూడా జైలుకు తరలించారు. ఆపై తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ కోర్టు నుండి బెయిల్ పై విడుదలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+