• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ వదిలిన ఆయుధం ఎవరో తెలుసా ?

|

జగన్ వదిలిన బాణం షర్మిల అయితే, రాహుల్ వదిలిన ఆయుధం ఎవరు ప్రియాంక గాంధీ నే కదా.. ఇలా ఆలోచిస్తున్నారా.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ వదిలిన ఆయుధం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇంతకీ ఆ ఆయుధం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.

కొత్తనినాదం తో ప్రజల్లోకి రేణుకా చౌదరి

కొత్తనినాదం తో ప్రజల్లోకి రేణుకా చౌదరి

తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎన్నికలలో లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన రేణుకా చౌదరి కొత్త ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నేను రాహుల్‌గాంధీ పంపిన ఆయుధాన్ని, లోక్‌సభ ఎన్నికల్లో పోరు కాంగ్రెస్‌, టీడీపీ కార్యకర్తలు, ఈ పార్టీల ఫిరాయింపుదారులకు మధ్యే జరగబోతోంది అంటూ కొత్త నినాదంతో ఆమె ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ , టీడీపీ కార్యకర్తలకు , ఫిరాయింపు నేతలకు మధ్య జరుగుతున్న పోరిది

కాంగ్రెస్ , టీడీపీ కార్యకర్తలకు , ఫిరాయింపు నేతలకు మధ్య జరుగుతున్న పోరిది

ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన నామా నాగేశ్వరరావు టిడిపి ఫిరాయింపు ఎమ్మెల్యే కాగా ఇక ఆ నినాదంతోనే ఫిరాయింపు దారులకు కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలకు మధ్య జరుగుతున్న పోరుగా ఆమె సరికొత్త ప్రచారం తో ప్రజల్లోకి వెళ్తున్నారు.

అసలే ఎన్నికల ప్రచారంలో తడబడుతున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు రేణుక చౌదరి తన ప్రచారంతో చెమటలు పట్టిస్తున్నారు.

అధికార పార్టీ నేతను కాకపోవటం తో ఇబ్బంది పెడుతున్నారన్న రేణుకాచౌదరి

అధికార పార్టీ నేతను కాకపోవటం తో ఇబ్బంది పెడుతున్నారన్న రేణుకాచౌదరి

ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌, టీడీపీ వైరా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ పోటీ రేణుకది కాదని.. ఫిరాయింపుదారులపై కార్యకర్తలు చేస్తున్న పోరు అని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కావాలని ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని, తాను అధికార పార్టీకి చెందిన అభ్యర్థిని కాకపోవడంతో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి తనపై దాడులు, సోదాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

మోడీ చౌకీదార్ గా పనికిరాడు.. కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలు పెట్టాడు .. రేణుకా చౌదరి ఫైర్

ఎంపీ అభ్యర్థిగా తనపేరు ప్రకటించిన రోజే టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి

ఎంపీ అభ్యర్థిగా తనపేరు ప్రకటించిన రోజే టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి

ఎంపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన రోజే ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోయారని రేణుక షాకింగ్ కామెంట్ చేశారు.రాష్ట్రంలో రైతుల పంటలు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు కావాలంటే సీఎం కేసీఆర్ మాత్రం ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలను పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారని, రాజ్యాంగ విలువలను పాటించలేని కేసీఆర్‌ సీఎం పదవిలో కొనసాగేందుకు అనర్హుడని అన్నారు రేణుక చౌదరి. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి పరిపాలన చేయనప్పటికీ పాలన పక్కనపెట్టి ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసి పక్క పార్టీల ఎమ్మెల్యేలను కొనడం సిగ్గు మాలిన చర్య అన్న రేణుకా చౌదరి సంస్కారవంతమైన భాషను కూడా మాట్లాడలేని కేసీఆర్‌ను తరిమికొట్టాలని ప్రజలను కోరారు.

రాహుల్ గాంధీ పంపిన ఆయుధాన్ని .. ఆశీర్వదించండి అంటున్న రేణుకా చౌదరి

రాహుల్ గాంధీ పంపిన ఆయుధాన్ని .. ఆశీర్వదించండి అంటున్న రేణుకా చౌదరి

కాంగ్రెస్, టిడిపి, శ్రేణులకు ఈ ఎన్నికల్లో ఈసారి పాటించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ నేతలు ఖమ్మం జిల్లాలో తమ అసహనాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను తిడుతుంటే, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పండి అంటూ, నేను రాహుల్ గాంధీ పంపిన ఆయుధాన్ని అంటూ రేణుక చౌదరి రసవత్తర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదంతా చూస్తున్న ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపిస్తారనే విషయం మాత్రం కచ్చితంగా ఆసక్తికరమే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Khammam candidate Renuka Chowdhary criticizing the TRS Party . Renuka criticized that when she got the ticket then finalised the defeat of TRS candidate . and also she made sensational comments she is the weapon left by Rahul gandhi in Telanagan for the upcoming elections. She said that the KCR started to MLA's purchasing centers instead of crop purchasing centres .Renuka's campaign, which reminds us of the need of the Congress party to come to power in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more