ప్రేమను నిరాకరించిందని కత్తితో ఎంసీఏ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది; వరంగల్ లో దారుణం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హనుమకొండలోని గాంధీ నగర్ లో తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది విద్యార్థిని గొంతు కోశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. విపరీతంగా రక్తస్రావం జరగటంతో ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.

ప్రేమను నిరాకరించిన విద్యార్థినిపై యువకుడి ఘాతుకం
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం రంగంపేట మండలం నకిరేపల్లి గ్రామానికి చెందిన 23 సంవత్సరాల అనూష అనే ఎంసీఏ విద్యార్థిని, ఎంసీఏ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాదులో గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంది. సంగం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన అజార్ అనే వ్యక్తి అనూష వెంటపడేవాడు. తనను ప్రేమించాలని అనూషను వేధించేవాడు. అయితే అతని ప్రేమను అనూష నిరాకరించింది. ఈ క్రమంలో అనూష పై కోపం పెంచుకున్నాడు అజార్.

కత్తితో యువతి గొంతు కోసి పరారైన యువకుడు
శుక్రవారం నాడు ఉదయం అనూష వరంగల్ కు వచ్చిన క్రమంలో, ఈ విషయం తెలుసుకున్న అజార్ ఆమె ఇంటికి వెళ్ళాడు . ఇక ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అజార్ తన ప్రేమను నిరాకరిస్తున్న అనూష గొంతు కోసి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలిసిన యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

ప్రేమోన్మాది అజార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇలాంటి ప్రేమోన్మాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవడంతో మళ్లీమళ్లీ ఘటనలు సంభవిస్తున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేయడం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలిస్తున్నారు. దేశంలో మహిళల,బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా ప్రేమోన్మాదులు ఈ తరహా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు .

పెరుగుతున్న ప్రేమోన్మాదం .. తస్మాత్ జాగ్రత్త
ప్రేమను తిరస్కరించారని ఉన్మాదులు యువతులు, బాలికలపై పాశవికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా అమ్మాయిలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తమను ఎవరైనా ఇబ్బంది పెడుతున్న ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వారిపై చర్య తీసుకోవడమో, లేదా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమో చేస్తారు. ఇక ఇదే సమయంలో యువకులు కూడా ఈ తరహా దాడులకు దిగడం వారి భవిష్యత్తు సర్వ నాశనం అవుతుందన్న విషయం గుర్తించాలి.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications