హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎఫ్‌బి: జూలో తాబేలుపై నిలబడి ఫొటో, అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూ పార్కులోని వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి.. అక్కడి పక్షులతో ఫొటోలు దిగడంతో పాటు తాబేలుపై నిలబడి ఫొటో దిగాడు ఓ యువకుడు. ఈ దృశ్యాలు ఫేస్‌బుక్‌తో పాటు ఓ ఇంగ్లీషు పత్రికలో రావడం నగరంలో సంచలనం సృష్టిస్తోంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న జూ క్యూరేటర్ జి. రామకృష్ణరావు బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టామని, ఈ ఫొటోల్లోని వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఫజల్ షేక్‌గా అనుమానిస్తూ బహదూర్‌పురా పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశామన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో జూ పార్కులోని అన్ని ఎన్‌క్లోజర్ల వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశామని చెప్పారు. వన్యప్రాణుల పట్ల సామరస్యంగా మెలగాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షల గురించి మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నామని చెప్పారు. ఇది ఇలా ఉండగా, అనుమానితుడు ఫజల్ షేక్‌ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ హరీష్ కౌషిక్ తెలిపారు.

జూ పార్కులో పక్షులతో..

జూ పార్కులో పక్షులతో..

నగరంలోని నెహ్రూ జూ పార్కులోని వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి.. అక్కడి పక్షులతో ఫొటోలు దిగడంతో పాటు తాబేలుపై నిలబడి ఫొటో దిగాడు ఓ యువకుడు.

ఫొటోలు చూపుతున్న అధికారి

ఫొటోలు చూపుతున్న అధికారి

ఈ దృశ్యాలు ఫేస్‌బుక్‌తో పాటు ఓ ఇంగ్లీషు పత్రికలో రావడం నగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జూ క్యూరేటర్ జి. రామకృష్ణరావు బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

తాబేలుపై నిల్చుని..

తాబేలుపై నిల్చుని..

ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టామని, ఈ ఫొటోల్లోని వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఫజల్ షేక్‌గా అనుమానిస్తూ బహదూర్‌పురా పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశామన్నారు.

ఫొటోలు..

ఫొటోలు..

ఈ ఫొటోలు నిరుడు జూన్, జులైల్లో దిగి ఉండవచ్చన్నారు. ఉదయం 9 - 10.30 గంటల మధ్యలో వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోని వ్యర్థ ఆహార పదార్థాలు, యానిమల్ కీపర్లు తొలగిస్తారని, ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి ఫోటో దిగి ఉండవచ్చని ఆయన తెలిపారు.

English summary
Fazal Shaik , a resident of Hyderabad has visited the zoo several times in the month of July-2014 during his visit he entered into the Galapogus Tortoise enclosure and taken the photos which is strictly prohibited for the visitors , he has taken photographs standing on the back of the tortoise , accordingly a case has been filed against him in the P.S.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X