Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'రేవంత్ కేసులో ఏసీబీ డీజీ పప్పులో కాలేశారు', 'టీఆర్ఎస్ చీఫ్‌గా జగన్'

హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ డీజీ ఖాన్ పప్పులో కాలేశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ బుధవారం అన్నారు. రేవంత్ రెడ్డి కేసులో దర్యాఫ్తు విషయంలో తెలంగాణ ఏసీబీ తీరును ఆయన తప్పుబట్టారు. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్నారు.

ఇది ఎవరి పరిధిలోకి వస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు హేతుబద్ధమైన ముగింపు ఇవ్వాలని తెలంగాణ, ఏపీ ఎన్నికల అధికారి అనుమతి ఇచ్చారంటూ వాట్సప్‌లోను, కొన్ని టీవీ ఛానళ్లలోను చేస్తున్న ప్రచారంపై అనుమానం వ్యక్తం చేశారు.

ఈ నెల 16వ తేదీతో ఆ వాట్సప్ సందేశాన్ని ఈ నెల 17న ప్రచారంలో పెట్టారన్నారు. మే 31వ తేదీన కేసు పెడితే ఈ నెల 16న ఈసీ అనుమతిచ్చిందని చెప్పడం విడ్డూరమన్నారు. ఈసీ అలాంటి కేసు దర్యాఫ్తు చేసే బాధ్యత ఏసీబీకి అప్పగించదని చెప్పారు. ఈసీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

 YS Jagan behaving like TRS chief of Telangana, says TDP

ఏపీ వైసీపీ అధ్యక్షుడిగా జగన్: సతీష్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ చీప్ జగన్ పరస్పర అవగాహనతో ఒకరి బాధ్యతలు ఒకరు మోస్తూ రెండు రాష్ట్రాలను అభాసుపాలు చేస్తున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెరాస అధ్యక్షునిగా కేసీఆర్, తెలంగాణ తెరాస అధ్యక్షునిగా జగన్ వ్యవహరిస్తున్నారన్నారు.

బుధవారం కడప నగరం స్టేట్‌గెస్ట్ హౌస్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఎన్నికలు జరిగినా ఎన్నికల కమిషన్ నేతృత్వంలో పరిపాలన, లా అండ్ అర్డర్ ఉంటుందన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్, జగన్ వ్యవహరిస్తున్నారన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఫోన్ ట్యాపింగ్‌తో దేశద్రోహానికి పాల్పడిన కేసీఆర్ సిగ్గులేకుండా బరితెగించి వ్యవహరిస్తున్నారన్నారు. తెలుగు ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నారు. తన తండ్రి హయాంలో అక్రమాలతో లక్షలకోట్లు దోపిడీ చేసి జైలుకు వెళ్లినా జగన్‌కు సిగ్గురాలేదన్నారు.

కేవలం అధికారదాహంతో కేసీఆర్‌తో చేతులు కలిపి దొంగలు దొంగలు ఊర్లు పంచుకునే చందంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాష్టవ్రిభజన అనంతరం రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు వచ్చినా చంద్రబాబు మొక్కవోని ధైర్యంతో దేశ విదేశాలలో పర్యటించి నూతన రాజధాని నిర్మాణం కోసం నిద్ర, ఆహారాలు మాని పని చేస్తున్నారని, ఇలాంటి సమయంలో ఓటుకు నోటు అంటూ కేసీఆర్, జగన్ బాబును అభాసుపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మరన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం నుంచే కేసీఆర్ ఆంధ్రాకు భవనాలు కేటాయించకుండా, విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఐఏఎస్, ఐపిఎస్‌లను వేధిస్తు ఆంధ్రాకు దక్కాల్సిన పథకాలు, ప్రాజెక్టుల విషయంలో అనవసరంగా సమస్యలు సృష్టిస్తు చివరకు రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య చిచ్చుపెట్టి గొడవలు వచ్చేలా చేశారని, రాజ్యాంగ పరంగా ఈ విధులు సక్రమంగా కెసిఆర్ నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాజ్యాధికారాన్ని చేతుల్లోకి తీసుకుని జగన్, కేసీఆర్‌లు బరితెగించి ప్రవర్తిస్తున్నారని వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+