Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయాల కోసం రాష్ట్రాలు తిరుగుతారు; చనిపోయిన రైతుకుటుంబాలను ఆదుకోరు: విరుచుకుపడిన వైఎస్ షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ ప్రభుత్వ తీరుపై వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సీఎం కేసీఆర్ చోద్యం చూస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగామరోమారు సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్ షర్మిల.

Recommended Video

    YSR Telangana Party celebrates registration by EC | Oneindia Telugu

     తెలంగాణాలో మిర్చి రైతుల కష్టాలపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల

    తెలంగాణాలో మిర్చి రైతుల కష్టాలపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల

    తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలపై సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కెసిఆర్ పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. తామర తెగులు సోకి, అకాల వర్షాలకు మిర్చి రైతు నష్టపోతే ఆదుకోవాల్సిన సర్కార్ పరామర్శతోనే సరిపెట్టుకొంటే, సాయం కోసం ఎదురుచూసిన మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు, అయినా సీఎం కేసీఆర్ కు సోయి లేదని షర్మిల పేర్కొన్నారు.

     రాజకీయాల కోసం రాష్ట్రాలు తిరుగుతారు , చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోరు

    రాజకీయాల కోసం రాష్ట్రాలు తిరుగుతారు , చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోరు

    ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే మూడు నెలల్లోనే 17 మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మీ రాజకీయాల కోసం రాష్ట్రాలు తిరుగొచ్చు, గ్రూప్ లు కట్టచ్చు కానీ చనిపోతున్న రైతు కుటుంబాలను ఆదుకోరు అంటూ నిప్పులు చెరిగారు. మీ బంగారు తెలంగాణ బూటకమౌతుందని వారిని పరామర్శించడం లేదా? అని షర్మిల నిలదీశారు. సొంత రాష్ట్ర రైతు అవస్థ తీర్చలేని మీరు దేశంలోని రైతులందరికీ ఏం సమాధానం చెప్తారు అంటూ షర్మిల సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు.

     తెలంగాణా రైతులనే ఆదుకోలేని మీరు దేశ రైతులను ఆదుకుంటారా ?

    తెలంగాణా రైతులనే ఆదుకోలేని మీరు దేశ రైతులను ఆదుకుంటారా ?


    తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో సొంత రాష్ట్రంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదంటూ, రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదంటూ షర్మిల మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలను తీర్చలేని కెసిఆర్, దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కష్టాలను తీరుస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పుకోవడం బూటకమని మండిపడ్డారు.

    పెద్ద దొర, చిన్న దొరా, చూడండి మీ నాయకుల బాగోతం

    పెద్ద దొర, చిన్న దొరా, చూడండి మీ నాయకుల బాగోతం


    అంతకుముందు సీఎం కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన షర్మిల బాలికపై అత్యాచారానికి పాల్పడిన టిఆర్ఎస్ నాయకుడు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆడ పిల్లల వంక చూస్తే గుడ్లు పీకేస్తాం, లంచాలు అడిగితే గల్లాపట్టి కొట్టండి అని చెప్పిన పెద్ద దొర, చిన్న దొరా, చూడండి మీ నాయకుల బాగోతం అంటూ టిఆర్ఎస్ నాయకుడి అత్యాచార ఉదంతాన్ని టార్గెట్ చేశారు. లంచంగా అమ్మాయిల మానాన్ని అడుతున్నారు. ఇండ్లు ఇప్పిస్తామని అమాయక అమ్మాయిలను లోబర్చుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కంచే చేను మేసినట్టు పరిస్థితి.. మహిళలకు రక్షణ ఎక్కడిది?

    కంచే చేను మేసినట్టు పరిస్థితి.. మహిళలకు రక్షణ ఎక్కడిది?

    కంచే చేను మేసిందన్నట్లు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వంలోని పెద్దలే గద్దల్లా అమ్మాయిల మాన ప్రాణాలు పీక్కు తింటుంటే ఇంకెక్కడిది మహిళలకు రక్షణ? అని ప్రశ్నించారు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా మీ నాయకుల తప్పులు మీ కండ్లకు కనపడవు అని అసహనం వ్యక్తం చేశారు. మీ చట్టానికి దొరకవు అని మండిపడ్డారు. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరుగకూడదంటే, గుడ్లు పీకాల్సింది మీవా? మీ నాయకులవా? మీరే తేల్చుకోండి అంటూ షర్మిల తీవ్రస్థాయిలో కెసిఆర్ పై ధ్వజమెత్తారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+