అంతా మోసమేనంటూ కేసీఆర్‌పై షర్మిల ఫైర్: కేటీఆర్‌పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. కేసీఆర్ రాష్ట్రానికిఏం చేశారో చెప్పాలని పాదయాత్ర చేస్తున్న షర్మిల డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆమె కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ చేసిందంతా మోసమే..: షర్మిల
కేసీఆర్ ఉచిత విద్యంటూ విద్యార్థులను, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను, వడ్డీ లేని రుణాలంటు డ్వాక్రా మహిళలను, రైతులను, రిజర్వేషన్లు పెంచుతానని మూడెకరాల భూమి ఇస్తానని ఎస్సీ ఎస్టీలను, డబుల్ బెడ్రూంలు ఇస్తానని పేదలను మోసం చేశారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకెళ్లారట కేసిర్ లాంటోళ్లు అని షర్మిళ విమర్శించారు.

నీళ్లు, నియామకాలు కేసీఆర్ ఇంటికేనంటూ షర్మిల చురకలు
నీళ్లు కేసీఆర్ ఫాంహౌస్ కే, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంటికే పరిమితం అయ్యాయయని షర్మిల విమర్శించారు. ఎప్పుడు ఆలోచించాడు? కేసీర్ రాష్ట్ర ప్రజల గురించి, ఎప్పుడు వెళ్ళాడు సెక్రెటేరియట్‌కు, ఏమి చేశాడు నల్గొండ జిల్లాకు అంటూ కేసీఆర్‌పై షర్మిళ ధ్వజమెత్తారు. వైస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో నల్గొండ జిల్లాకు 30 సార్లు వచ్చి ఈ జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించారన్నారు. ఎస్సెల్బీసీ సొరంగం, ఫ్లోరైడ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసారు. ఎస్సెల్బీసీ ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేద్దామని పనులు మొదలు పెట్టారు, కానీ ఇప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అవి నత్తనడకన నడుస్తున్నాయన్నారు షర్మిల. రూ.2000 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. వైస్సార్ సీఎంగా పనిచేసిన కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మద్దతుధర లతో రైతులకు అండగా ఉన్నారు.
Recommended Video

సిగ్గులేదా అంటూ కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంచిర్యాలకు చెందిన మహేశ్ అనే యువకుడు జాబ్ నోటిఫికేషన్‌లు రావడం లేదని మనస్థాపంతో ఆత్మహత్య సుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన రేవంత్ రెడ్డి మరణం.. కాదు రణం చేద్దామంటూ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఓవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యవత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే భారీగా పెట్టుబడులు తీసుకువస్తున్నాం.. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ కబుర్లు చెప్పుకోవడానికి కేటీఆర్ సిగ్గులేదా? అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఉద్యోగాలు రాలేదని మనస్థాపానికి గురి కావద్దని.. మనోధైర్యంతో ముందుకువెళ్లాలని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని పెట్టవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications