వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల తేల్చేసారు - అక్కడి నుంచే పోటీ చేస్తున్నా : వైఎస్సార్ వారసత్వం నాదే..!!

|
Google Oneindia TeluguNews

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. సుదీర్ఘ పాదయాత్రలో ఉన్న షర్మిల వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసే అంశం పైన క్లారిటీ ఇచ్చారు. కొంత కాలంగా జరుగున్న ప్రచారానికి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇదే సమయంలో తన తండ్రి వారసత్వం తనకు మాత్రమే ఉందంటూ కొత్త చర్చకు కారణమయ్యారు. నేలకొండపల్లి లో పాలేరు నియోజక వర్గ కార్యకర్తలతో షర్మిల సమావేశం అయ్యారు. పాలేరు నుంచి పోటీ చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించారు.

తేల్చి చెప్పిన షర్మిల

తేల్చి చెప్పిన షర్మిల


ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ పేరు అస్తి అయితే ఏకైన వారసులం మనమేనంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో వైఎస్సార్ వారసత్వం కేవలం ఆయన బిడ్డగా తనకే ఉందని స్పష్టం చేసారు. ఇతర వ్యక్తి కి...ఇతర పార్టీ కి ఆ హక్కులేదంటూ తేల్చి చెప్పారు. వైఎస్సార్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదని వివరించారు. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉందన్నారు. పాలేరు నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు కాబట్టి దేవుడు తధాస్తు అంటాడు అని తన గట్టి నమ్మకమని చెప్పుకొచ్చారు.

పాలేరు లో పోటీ ఎందుకంటే

పాలేరు లో పోటీ ఎందుకంటే

పాలేరు లో పోటీ చేయాలనేది మీ కోరిక కాదు...తన కోరిక కూడా అంటూ వెల్లడించారు. వైఎస్సార్ పార్టీ పతాకం పాలేరు గడ్డ పై ఎగరాలని ఆకాంక్షించారు. అత్యధిక మెజారిటీ కోసం తనతో కలిసి పని చేయాలని నిర్దేశించారు. ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు..అంటూ ప్రకటించారు. తన పాదయాత్రను క్యాట్ వాక్ అన్నారని..వారిని త్వరలోనే రాజకీయంగా తరిమి కొడతామని హెచ్చరించారు. ఇక, ఇప్పటికే పాలేరు నుంచి షర్మిల పోటీ చేసే అంశం..అక్కడ లభించే మద్దతు పైన సర్వేలు సైతం చేయించినట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాల పరంగా అక్కడ ఉన్న సమీకరణాలు సైతం కలిసి వస్తాయని షర్మిల అంచనాకు వచ్చారు. పాలేరు లో రెడ్డి సామాజిక వర్గ నేతలే గెలుస్తూ వచ్చారు.

తండ్రి వారసత్వం పైనా కీలకంగా

తండ్రి వారసత్వం పైనా కీలకంగా


ఓటింగ్ వచ్చే సరికి గిరిజన సాంప్రదాయ ఓటింగ్ ఇప్పటి వరకు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. వైఎస్సార్ కుమార్తెగా షర్మిల బరిలో నిలిస్తే ఆ వర్గం మద్దతు సైతం తనకే ఉంటుందనేది షర్మిల అంచనాగా తెలుస్తోంది. వైఎస్పార్టీలో పోటీ చేసే నేతలు..నియోజకవర్గాల పైన ఇప్పటి వరకు చర్చ లేదు. అయితే, ముందుగా పార్టీ చీఫ్ గా షర్మిల తాను పోటీ చేసే నియోజకవర్గం పైన క్లారిటీ ఇచ్చారు. అయితే, ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ చేసారు. పాలేరు లో గెలిచి చూపించాలని షర్మిలకు ఛాలెంజ్ చేసారు. ఇక, ఇప్పుడు షర్మిల అక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించటంతో...ఇప్పటికే హీటెక్కిన తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త సమీకరణ ప్రారంభం కానుంది.

English summary
YSRTP Chief Sharmila said that will contest from Paleru constituency in Khammam district in up coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X