హుజురాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసమే ... వైయస్సార్ టీపీ పోటీపై తేల్చేసిన వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైయస్సార్ వారసురాలిగా దూకుడు చూపిస్తున్న వైయస్ షర్మిల అధికార టీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ టీపీ హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తుందా అనే విషయంపై ఆసక్తికర ప్రకటన చేశారు షర్మిల.
హుజురాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా అని ప్రశ్నించిన షర్మిల, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు 3 ఎకరాల భూమి వస్తుందా ? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీ చేస్తామంటూ షర్మిల పేర్కొన్నారు. అంతేకాదు హుజురాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమేనని వైయస్ షర్మిల తేల్చిచెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో వైయస్సార్ టీపీ పోటీ చేయబోదని స్పష్టం చేశారు.

ఇప్పటికే నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటించాలని పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే అవసరం ఏముందని వస్తున్న విమర్శలకు కూడా సమాధానం చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించిన షర్మిల, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరిందా? బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగిందా? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించి పార్టీ పెట్టామని స్పష్టం చేశారు.
• హుజురాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా?
— YS Sharmila (@realyssharmila) July 17, 2021
• హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయం
• నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా?
• దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా?
• ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం
• హుజూరాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే. pic.twitter.com/w5VfIArIJv
తెలంగాణా నా గడ్డ ..ఇది నా రియాలిటీ , ప్రజల కోసం నిలబడి పోరాడే పార్టీ వైఎస్సార్ టీపీ అంటూ బల్ల గుద్ది మరీ చెప్తున్న షర్మిల తెలంగాణ రాజకీయాలలో తన మార్కు దూకుడు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ విషయమైనా కుండ బద్దలు కొడుతూ మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.












Click it and Unblock the Notifications