వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్ బంగారు తెలంగాణా ఎక్కడయ్యిందో చెప్పాలి: వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయాలు మొదలు పెట్టిన వైయస్ షర్మిల, అప్పటినుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా నిరుద్యోగుల కోసం వైయస్ షర్మిల చేసిన నిరుద్యోగ నిరాహార దీక్షలో సీఎం కేసీఆర్ ను, టిఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఉత్త మాటలు కాదు, ఉద్యోగాలు ఇవ్వాలంటూ వైయస్ షర్మిల డిమాండ్ చేశారు.

తెలంగాణా రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారు

తెలంగాణా రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారు

తెలంగాణ రాష్ట్రంలో రెండు దఫాలుగా పరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదని వైయస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పనలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్ర‌జాప్ర‌స్థానంలో భాగంగా ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ నిరాహార దీక్ష 32వ వారం నారాయ‌ణ్ పేట్ జిల్లా మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఊట్కూర్ మండ‌లం నిడుగుర్తి గ్రామంలో నిర్వహించామని పేర్కొన్న షర్మిల ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పి, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారు అని నిప్పులు చెరిగారు.

ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు

ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు

ఇకనైనా ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలతో పాటు కొత్త జిల్లాలు, మండలాల వారీగా ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందని వైయస్ షర్మిల మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చేసిన యువతకు భరోసా లేకుండా పోయిందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. కొలువులు లేక, సమాజంలో తలెత్తుకోలేక,కుటుంబపోషణ భారమై యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పాపం ముమ్మాటికీ కెసీఆర్ దే


ఈ పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే అని మండిపడ్డ షర్మిల ఇప్పటికైనా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు . ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే రెండు నిమిషాల్లో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వచ్చు అని పేర్కొన్న వైయస్ షర్మిల, కానీ కేసీఆర్ ఆ పని చేయడం లేదంటూ మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబంలోని వారికి ఐదు ఉద్యోగాలు ఉండాలా ? అని ప్రశ్నించిన షర్మిల, కనీసం చదువుసంధ్యలు లేని వాళ్ళు ఎమ్మెల్యేలు, పాలకులు అవుతున్నారు అంటూ మండిపడ్డారు.

Recommended Video

తెలంగాణా అమరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్ *Telangana | Telugu OneIndia
బంగారు తెలంగాణా ఇదేనా కెసీఆర్ ?

బంగారు తెలంగాణా ఇదేనా కెసీఆర్ ?


తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశామని, ప్రజలు కడుపునిండా తింటున్నారని, కంటినిండా నిద్ర పోతున్నారని కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బంగారు తెలంగాణ ఎలా అయిందో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. కనీసం పాఠశాలల్లో భవనాలు లేక, టాయిలెట్స్ లేక, చదువు చెప్పే టీచర్లు లేక, పురుగుల భోజనం తినలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు వైయస్ షర్మిల.

నిరుద్యోగుల కోసం వైఎస్ షర్మిల డిమాండ్లు ఇవే

నిరుద్యోగుల కోసం వైఎస్ షర్మిల డిమాండ్లు ఇవే


కెసిఆర్ చెప్పే మాటలకు, రాష్ట్రంలో పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్న వైఎస్ షర్మిల ఇప్పటికైనా కెసిఆర్ నిరుద్యోగులకు భరోసా కల్పించాలని చేశారు. నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ని వెంటనే చెల్లించాలని, కొత్త జిల్లాల ప్రకారం అవసరమైన ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చెయ్యాలని, యువతకు స్వయం ఉపాధి లోన్స్ వెంటనే అందించాలని, నిరుద్యోగ యువతకు బాకీ పడ్డ 1,20,000 నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేవరకు నిరుద్యోగ పోరు ఆగదని వైయస్ షర్మిల స్పష్టం చేశారు.

English summary
YS Sharmila asked KCR to tell where the golden Telangana when unemployed are committing suicides. YS Sharmila demanded that the unemployed should be given jobs immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X