Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎలాగైనా చచ్చుడే.. అంతేకదా చిన్నదొర; కేటీఆర్, కేసీఆర్ లపై విరుచుకుపడిన వైఎస్ షర్మిల

నిత్యం సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ ను, కేటీఆర్ ను, టిఆర్ఎస్ ముఖ్య నేతలను టార్గెట్ చేసే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైయస్ షర్మిల మరోమారు సీఎం కేసీఆర్ పై, గులాబీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఫీవర్ సర్వే పై, కేంద్రాన్ని వివిధ విషయాల్లో టార్గెట్ చేస్తున్న కేటీఆర్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ సర్కార్ ను నిలదీసిన వైయస్ షర్మిల హెల్త్ వర్కర్ల గురించి కెసిఆర్ ను ప్రశ్నించారు. ఇంటింటికీ ఫీవర్ టెస్ట్ లు చేస్తున్న హెల్త్ వర్కర్ల ప్రాణాలంటే పట్టింపు లేదా? వాళ్ల ప్రాణాలు లెక్క లేదా? అంటూ షర్మిల విరుచుకుపడ్డారు.

 ఫీవర్ సర్వే చేస్తున్న హెల్త్ వర్కర్ల విషయంలో షర్మిల డిమాండ్లు

ఫీవర్ సర్వే చేస్తున్న హెల్త్ వర్కర్ల విషయంలో షర్మిల డిమాండ్లు

చీర కొంగులు.. కర్చీఫులు కట్టుకొని సర్వే చేయాల్నా? అంటూ ప్రశ్నించారు వైయస్ షర్మిల కనీసం వాళ్లకు మాస్క్ లు, శానిటైజర్ల్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందా ప్రభుత్వం? అంటూ మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కోసం హెల్త్ వర్కర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టాలంటూ కెసిఆర్ సర్కారును ప్రశ్నించారు. ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుని పని చేస్తున్న హెల్త్ వర్కర్లకు మాస్కులు, శానిటైజర్ లను అందించాలని వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో వారికి జీతంతో పాటు స్పెషల్ బోనస్ ఇవ్వాలని వైయస్ షర్మిల కెసిఆర్ సర్కార్ ను డిమాండ్ చేశారు. అంతేకాదు వారికి కరోనా సోకితే స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సదుపాయాలను కల్పించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

 చేనేతకు చేయూత ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్ పై సెటైర్లు

చేనేతకు చేయూత ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్ పై సెటైర్లు

ఇక ఇదే సమయంలో వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మెగా పవర్ లూమ్ ఏర్పాటు, తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని చేనేతకు సాయం అందించాలని మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులకు లేఖ రాసిన నేపథ్యంలో కేటీఆర్ కేంద్రమంత్రులకు లేఖ రాయడంపై వైయస్ షర్మిల మండిపడ్డారు.2017లో టెక్స్ట్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేసినప్పుడు కేటీఆర్ చెప్పిన మాటలు అంటూ గుర్తు చేసిన షర్మిల 28 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, 3 వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని, 22 కంపెనీలు వస్తాయని మీ సర్కార్ చెప్పినదంతా ఉత్తదేనా? లేకపోతె మీపైనున్న వ్యతిరేకత తప్పించుకోవడానికి అత్త మీద కోపం దుత్త మీదికి మల్లించుడా? అంటూ ప్రజలు తమను ప్రశ్నించకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపుతున్నారు అంటూ మండిపడ్డారు.

రైల్వే లైన్ పై అప్పుడు వదిలేసి ఇప్పుడు నెత్తికొట్టుకుని నవ్వులపాలు కాకు అంటూ చురకలు

రైల్వే లైన్ పై అప్పుడు వదిలేసి ఇప్పుడు నెత్తికొట్టుకుని నవ్వులపాలు కాకు అంటూ చురకలు

ఇక తెలంగాణకు కొత్త రైల్వే లైన్ లో ఏవి అంటూ ప్రశ్నించిన మంజూరులో వివక్ష అన్యాయం జరుగుతుందంటూ మండిపడిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీరుపై సోషల్ మీడియా వేదికగా చురకలంటించారు. రాష్ట్రం నుంచి 11 ప్రతిపాదనలు పంపిన ఒక దాని పైన కూడా రైల్వే శాఖలో చలనం లేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు వైయస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. 8ఏళ్ళుగా కేంద్రానికి వంతపాడుతూ 2014లోనే రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా మంజూరు చేయట్లేదని,కొత్త లేన్లు వేస్తలేరని ఇప్పుడు డ్రామాలు మొదలెట్టారా చిన్నదొరా? అంటూ వినోద్ కుమార్ ను టార్గెట్ చేశారు. 3ఏండ్ల క్రితమే కేంద్రం తెలంగాణకు కాకుండా మహారాష్ట్రకు మంజూరు చేసినప్పుడు కాకుండా ఇప్పుడు నెత్తికొట్టుకుని నవ్వులపాలు కాకు అంటూ హితవు పలికారు.

 ఎలాగైనా చచ్చుడే. అంతే కదా చిన్న దొర .. మండిపడిన షర్మిల

ఎలాగైనా చచ్చుడే. అంతే కదా చిన్న దొర .. మండిపడిన షర్మిల

ఇక మరో పోస్ట్ లో రాష్ట్రంలో తాజా పరిణామాలపై వైఎస్ షర్మిల మంత్రి కేటీఆర్ ను, టిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు.పర్మిషన్ ఇస్తే హత్య, ఇవ్వకపోతే ఆత్మహత్యే దిక్కు అంటూ పేర్కొన్నారు. దొరగారి పాలనలో చావు మాత్రం పక్కా అంటూ మండిపడ్డారు. ఉద్యోగాల కోసం చావాలి, ఉద్యోగాలను కాపాడుకోవడం కోసం చావాలి అంటూ విరుచుకుపడ్డారు. పంటను అమ్ముకోవడం కోసం చావాలి, భూములు గుంజుకొంటే నష్టపరిహారం కోసం సజీవదహనం చేసుకోవాలి.ఎలాగైనా చచ్చుడే.అంతే కదా చిన్నదొర అంటూ సెటైర్లు వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+