జాతీయ రహదారిపై బైఠాయించి వైఎస్ షర్మిల ధర్నా: రైతుల కోసం డిమాండ్; ఆందోళనలకు పిలుపు!!

ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల ప్రజా సమస్యల కోసం ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల రైతుల కోసం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.

ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయడం మాత్రమే కాకుండా, ప్రజా సమస్యల కోసం ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల విద్యుత్ సమస్యలపై రఘునాథ్ పల్లి సబ్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రఘునాథపల్లి సబ్ స్టేషన్ ముందు వరంగల్ రహదారిపై బైఠాయించిన వైయస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ వైయస్ షర్మిల రైతులతో కలిసి ఆందోళన బాట పట్టారు.

వ్యవసాయానికి 24 గంటల కరెంట్.. కేసీఆర్ గోబెల్స్ ప్రచారం

వ్యవసాయానికి 24 గంటల కరెంట్.. కేసీఆర్ గోబెల్స్ ప్రచారం

ఇక ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అని కేసీఅర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ కోతలు లేకుండా పాలన అని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. అమెరికాలో అయినా కరెంటు కోతలు ఉంటాయి కానీ తెలంగాణలో మాత్రం ఉండవని గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. 24 గంటలు క్షణం కూడా కరెంటు పోకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నారని, అందువల్లే తాము అధికారంలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారని షర్మిల విమర్శించారు.

కరెంటుపై దొంగల ముఠా దొంగ మాటలు

కరెంటుపై దొంగల ముఠా దొంగ మాటలు

కెసిఆర్ దొంగల ముఠా దొంగ మాటలు చెబుతోందని, కరెంట్ విషయంలో ఏం జరుగుతుందో, ఇందులో వాస్తవం ఎంతో తెలంగాణ రైతాంగానికి తెలుసని షర్మిల పేర్కొన్నారు. ఇదే రఘునాథ్ పల్లి మండలంలో పగలు 5 గంటలకు కూడా కరెంట్ ఇవ్వడం లేదని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. అసలు విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు అని షర్మిల పేర్కొన్నారు. ఈ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగవుతుంది. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ధర్నాలు చేస్తున్నా కెసిఆర్ కంటికి మాత్రం కనిపించడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీస్తాడట

కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీస్తాడట

అసెంబ్లీ వేదికగా పిచ్చిపిచ్చి ప్రకటనలు చేస్తున్నారని, మీ కంటికి రైతుల ఆందోళన ఎందుకు కనిపించడం లేదని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలోనే దిక్కులేదు కానీ దేశమంతా కరెంటు ఇస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీస్తాడట కేసీఆర్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని పిచ్చి మాటలు చెప్తున్నాడని మండిపడ్డారు. పిట్టల దొర లెక్క టోపీ పెట్టుకొని విమానాల్లో తిరిగి మా సర్కార్ గొప్పది అంటే సరిపోతుందా..? అంటూ ప్రశ్నించారు.

కిసాన్ కి బార్బాత్ చేసిన సర్కార్

కిసాన్ కి బార్బాత్ చేసిన సర్కార్

రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మీరు ఇచ్చే బోడి 5 వేల రైతుబంధు చాలక ఆత్మహత్యలు జరిగాయని షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్ ఇచ్చిన సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టారని, 30 వేల రూపాయల విలువ చేసే పథకాలన్నీ బంద్ పెట్టి రైతులను కోటీశ్వరులను చేస్తున్నామంటే ఎలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు 1000 కోట్ల పంట నష్టం జరుగుతుందని పేర్కొన్న షర్మిల ఇది ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ కాదు..కిసాన్ కి బార్బాత్ చేసిన సర్కార్ అంటూ మండిపడ్డారు.

సబ్ స్టేషన్ల ముందు ప్రతిరోజు ఆందోళనలకు షర్మిల పిలుపు

రైతులకు హామీ ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా ఉంటామన్నారు వైయస్ షర్మిల. ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు 24 గంటల కరెంటు ఇచ్చేవరకు సబ్ స్టేషన్ల ముందు ప్రతిరోజు ఆందోళనలు చేయాలని వైయస్ షర్మిల పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+