మీ తప్పుని సరిదిద్దుకొని ధరణి పంచాయితీలు తెంపండి: కేసీఆర్ కు వైఎస్ షర్మిల సలహా
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కు బిజెపి-కాంగ్రెస్ ల తో పాటు మరో తలనొప్పిగా తయారైంది వైయస్సార్ తెలంగాణ పార్టీ. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ పార్టీని స్థాపించి, ప్రజా సమస్యల కోసం పోరాటం సాగిస్తున్నారు. రైతు సమస్యల కోసం, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న షర్మిల నిత్యం తెలంగాణ సీఎం కేసీఆర్ ను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సోషల్ మీడియా ను వేదికగా చేసుకున్న షర్మిల రోజుకో అంశంపై తెలంగాణ సర్కార్ ను ఇరకాటంలో పెడుతున్నారు. సీఎం కేసీఆర్ కు ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు.

ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి ధరణి భూ సమస్యల పరిష్కారం పై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని షర్మిల సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ కారణంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని, హత్యలకు కూడా పాల్పడుతున్నారంటూ వైయస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తో పనికిమాలిన పని చేశారని మండిపడ్డారు.

ధరణితో యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారు
ధరణి భూ సమస్యల పరిష్కారానికి మంత్రదండం అని చెప్పుకున్న కేసీఆర్ గారు, ఉన్న సమస్య పరిష్కారమేమో కానీ లేని సమస్యలను సృష్టించారు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. భూమి ఉన్నోళ్లకు లేనట్టు, లేనోళ్లకు ఉన్నట్టు చూపెడుతూ యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారు అని వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు.భూమి కోసం అధికారుల చుట్టూ తిరగలేక లంచాలు ఇచ్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. అర్ధాంతరంగా చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారని వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు

ధరణి పోర్టల్ వల్ల భూముల కోసం హత్యలు చేసుకుంటున్నారు..
కాస్తు కాలాన్ని ఎత్తేస్తే పాత పేర్ల మీద రికార్డులు చూపటంతో ఆ భూముల కోసం హత్యలు చేసుకుంటున్నారు అని షర్మిల ఆరోపించారు.లోపాలు ఉన్నాయని మీరే ఒప్పుకొన్నా వాటిని పరిష్కరిస్తే మీ పనికిమాలిన పని ఈ ధరణి పోర్టల్ అని తేలిపోతుందని భయపడుతున్నారా? అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. మీ తప్పుని సరిదిద్దుకొని ధరణి పంచాయితీలు తెంపండి అని వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ కు డిమాండ్ చేశారు.
Recommended Video

వెంటనే ధరణి పంచాయితీలు తెంచండన్న షర్మిల
ఇక ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి ధరణి విషయంలో రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న కర్ణం గూడా హత్యలకు కూడా భూవివాదాలు కారణమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అక్రమాలు విపరీతంగా పెరిగాయని, పాత భూయజమానులకు హక్కులు ఇవ్వడం ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. ధరణి పోర్టల్ ను అడ్డంపెట్టుకుని నిజాం కాలం నాటి భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఇక తాజాగా ధరణి పోర్టల్ విషయంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వైయస్ షర్మిల కూడా తీవ్ర విమర్శలు చేశారు. వెంటనే ధరణీ పంచాయతీలు తెంచాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications