• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైఎస్ షర్మిల పాదయాత్ర మూడోరోజు కంప్లీట్ షెడ్యూల్ ఇదే: సాయంత్రానికి శంషాబాద్‌కు

|
Google Oneindia TeluguNews

కడప: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి ఆమె తెలంగాణలో మహా పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 20వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టౌన్‌లో బహిరంగ సభను నిర్వహించిన అనంతరం ఆమె పాదయాత్ర మొదలైంది. తల్లి వైఎస్ విజయమ్మ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కాచారం నుంచి మొదలు..

కాచారం నుంచి మొదలు..

ఈ పాదయాత్ర మూడోరోజుకు చేరుకుంది. ప్రస్తుతం షర్మిల రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలం కాచారం క్రాస్ వద్ద బస చేశారు. అక్కడి నుంచే మూడోరోజు పాదయాత్ర చేపడతారు. ఉదయం 9:30 గంటలకు తాను బస చేసిన క్యాంప్ నుంచి బయలుదేరుతారు. 9:45 నిమిషాలకు కాచారంలోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. ప్రజలను కలుసుకుంటారు. అనంతరం పాదయాత్రకు బయలుదేరుతారు.

 ఊటపల్లి వద్ద మధ్యాహ్న భోజన విరామం..

ఊటపల్లి వద్ద మధ్యాహ్న భోజన విరామం..

10:15 నిమిషాలకు సుల్తాన్‌పల్లి క్రాస్, 10:45 నిమిషాలకు నర్కుడా క్రాస్, 11:30 నిమిషాలకు అమ్మపల్లి క్రాస్‌కు చేరుకుంటారు. అమ్మపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది- సమయం మీద ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఊటపల్లి సమీపంలోని ఒయాసిస్ స్కూల్‌ వద్ద విశ్రాంతి తీసుకుంటారు. మూడు గంటల పాటు పాదయాత్రకు భోజన విరామం ఉంటుంది.

 శంషాబాద్‌లో సభ.. పోశెట్టిగూడలో క్యాంప్

శంషాబాద్‌లో సభ.. పోశెట్టిగూడలో క్యాంప్

మధ్యాహ్నం 3 గంటలకు ఊటపల్లి ఒయాసిస్ స్కూల్ నుంచి పాదయాత్ర పునఃప్రారంభమౌతుంది. 3:15 నిమిషాలకు ఊటపల్లికి చేరుకుంటారు. ప్రజలను కలుసుకుంటారు. 3:45 నిమిషాలకు రాళ్లగూడ, సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ టౌన్‌కు చేరుకుంటారు. శంషాబాద్ టౌన్ బస్టాండ్ సెంటర్ వద్ద బహిరంగ సభను నిర్వహిస్తారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు పోశెట్టిగూడకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. నాలుగోరోజు పాదయాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది.

26 సమన్వయ కమిటీలు..

26 సమన్వయ కమిటీలు..

పాదయాత్ర ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమౌతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్‌ను తయారు చేస్తారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేస్తారు. పాదయాత్రను విజయవంతం చేయడానికి వైఎస్సార్‌టీపీ అగ్ర నాయకత్వం కోఆర్డినేషన్ కమిటీలను కూడా నియమించింది. మొత్తంగా 26 సమన్వయ కమిటీలు వైఎస్ షర్మిల పాదయాత్ర కోసం పని చేస్తోన్నాయి.

సమస్య మూలాల నుంచి..

సమస్య మూలాల నుంచి..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు వైఎస్ షర్మిల. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో, గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలే దీనికి నిదర్శనాలని చెబుతున్నారు. కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మూలల నుంచీ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారామె.

  YSRCP, TDP పై RGV సెటైర్..మధ్యలో ఆయన పై కూడా | Ap Politics || Oneindia Telugu
  గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలపై..

  గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలపై..

  రైతులు, గ్రామస్థాయిలో మహిళలు, మౌలిక సదుపాయాలు, కనీసం అవసరాల కొరత వంటి అంశాలను తెరమీదికి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో మంచినీటి కంటే మద్యమే అధికంగా లభిస్తోందంటూ మండిపడుతున్నారు. రైతుబంధు పేరుతో ప్రభుత్వం దగా చేస్తోందని, లక్ష రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. దాన్ని కుదించారని విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఆ వర్గానికి చెందిన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి.. ఇలా ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదంటూ విమర్శిస్తోన్నారు.

  English summary
  YSRTP Chief YS Sharmila's 3rd day Padayatra schedule is here.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X