Tirumla: లడ్డులో జంతువు కొవ్వు కలిపారా లేదా.. విచారణ చేయాలని సుప్రీంలో పిటిషన్..
ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సామాన్య భక్తుడి నుంచి వీఐపీల వరకు తిరుమల లడ్డూలో నిజంగానే జంతువు కొవ్వు కలిసిందా అని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై భక్తులు టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూలో నిజంగానే జంతువు కొవ్వు కలిపినట్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ
ఆచారం హిందూ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. రైతు, హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ సుప్రీంలో పిటిషన్ వేశారు. సిట్ తో విచారణ జరిపించాలని కోరారు. తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వార్త చాలా మందిని బాధించాయని అన్నారు. అందరిని దృష్టిలో ఉంచుకుని పిటిషన్ వేసినట్లు వివరించారు.

తిరుమల శ్రీవారి లడ్డూలో కొవ్వు వినియోగించారనే అరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇది టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇలా జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే దీనిపై విచారణ జరిపించాలని వైసీపీ డిమాండే చేస్తోంది.
లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ల్యాబ్ టెస్టింగ్ రిపోర్టులు చెబుతున్నాయని తెలుగు తమ్ముళ్లు వివరిస్తున్నారు. తాజాగా ఈ విషయమై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు.
తిరుమల హిందుత్వానికి మారని.. అలాంటి తిరుమల క్షేత్రంలో సీఎం చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రమే విచారణ చేయాలన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుడితో రాజకీయాలు మంచిది కాదని భక్తులు అంటున్నారు. వెంకటేశ్వర స్వామి కోట్లమంది భక్తులు నమ్ముతారని.. వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications