సీపీఐ నారాయణకు సతీవియోగం.. అనారోగ్యంతో సతీమణి కన్నుమూత
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి వసుమతి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నారాయణ నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే వామపక్ష నేతలు, ఇతర పార్టీల ప్రముఖులు నారాయణకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వసుమతి మృతి పట్ల సంతాపం తెలిపారు.

వసుమతి అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా నగరి సమీపంలో గల ఐనంబాకం వద్ద నిర్వహించనున్నారు. వసుమతి గతంలో బ్యాంక్ ఉద్యోగినిగా పనిచేశారు. ఆమెకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తాయి. మూడురోజుల కిందట స్టెంట్ అమర్చారు. వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. సీపీఐ నారాయణకు వసుపతి తోడుగా నిలిచారు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న కుటుంబానికి సమయం కేటాయించారు. బ్యాంక్ ఉద్యోగం చేస్తూనే.. ఫ్యామిలీకి తగిన సమయం ఇచ్చారు. ఆమె మృతితో నారాయణ ఇంట విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications