తిరుమల శ్రీవారి మూలవిరాట్టును పూర్తిగా కప్పి వేయనున్న అర్చకులు: ఆర్జిత సేవలు రద్దు

తెలుగు సంవత్సరాది పండగను పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. దీనికోసం ఎల్లుండి కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తిరుపతి: ఈ నెల 22వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది (Ugadi). శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆరంభమౌతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పండగను వైభవంగా జరుపుకోనున్నాయి. దీనికోసం ఆలయాన్ని ముస్తాబవుతున్నాయి. ఉగాది పంచాంగ శ్రవణాన్ని నిర్వహించడానికి ముందుగానే ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అధికారికంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

కోయిల్ అళ్వార్ తిరుమంజనం..

కోయిల్ అళ్వార్ తిరుమంజనం..

అటు తిరుమల (Tirumala) లో ఉగాది ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) అధికారులు కన్నులపండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోన్నారు. దీన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం (Koil Alwar Tirumanjanam) జ‌రుగ‌నుంది. సంవత్సరంలో నాలుగుసార్లు- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఆలయ శుద్ధి..

ఆలయ శుద్ధి..

ఆ రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి.. తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు.

 మధ్యాహ్నం 12 నుంచి

మధ్యాహ్నం 12 నుంచి

శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఉగాది నాడు..

ఉగాది నాడు..

ఉగాది ఆస్థానం నాడు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాతాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు..

ఆర్జిత సేవలు రద్దు..

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన (Arjita Sevas) కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ (TTD) అధికారులు రద్దు చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలను (VIP Break Darshans) రద్దు చేసినట్లు ఇదివరకే వెల్లడించారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫారసు లేఖలను కూడా స్వీకరించమని అధికారులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+