తిరుమలలో విషాదం - చిన్నారిని బలి తీసుకున్న చిరుత..!!

Tirumala: తిరుమలలో కాలి నడక మార్గంలో విషాదం చోటు చేసుకుంది. చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల కొండ పైకి వెళ్తున్న సమయంలో బాలిక అదృశ్యం అయింది. దీంతో, అధికారులకు సమాచారం ఇవ్వటంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద బాలిక మృత దేహం గుర్తించారు. దీంతో, తిరుమల పరిసరాల్లో విషాదం నెలకొంది.

నడకమార్గంలో విషాదం: తిరుమలలో నడక దారి ప్రాంతంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తిరుమలకు కాలి నడకన చేరుకొనే క్రమంలో బాలిక చిరుత దాడిలో మరణించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి తిరుమల కొండకు నడక మార్గంలో బయల్దేరింది. ముగ్గురు చిన్నారులతో వెళ్తున్న కుటుంబ సభ్యుల్లో అరేళ్ల వయసున్నలక్షిత శుక్రవారం రాత్రి నడకమార్గంలో అదృశ్యం అయింది.

Leopard killed girl in Alipiri - Tirumala path way, TTD Officials Alerts the devotees

దీంతో, అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో చిరుత ఒక చిన్నారి పైన దాడి చేసిన ప్రాంతం కావటంతో పోలీసులతో పాటుగా అటవీ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, ఊహించని విధంగా ఈ ఉదయం బాలిక మృత దేహాన్ని అధికారులు గుర్తించారు.

ఆరేళ్ల చిన్నారిని బలి తీసుకున్న చిరుత: అలిపిరి -తిరుమల కాలి నడక మార్గంలో భయాందోళనలు నెలకొంటున్నాయి. జూన్ 22న ఇదే ప్రాంతంలో ఒక చిన్నారి పైన చిరుత దాడి చేసింది. ఆ సమయంలో భక్తులు కేకలు వేయటంతో చిరుత చిన్నారిని వదిలేసి వెళ్లింది. ఆ బాలుడుకి టీటీడీ స్విమ్స్ లో చికిత్స చేయించింది. బాలుడు తరువాత కోలుకున్నాడు.

ఆ సమయం నుంచి భక్తులు నడక మార్గంలో రాత్రి సమయంలో గుంపులుగా గోవింద నామ స్మరణతో వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. చిరుతను పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేసారు. ఆ సమయంలో ఒక చిరుతను బంధించారు. మరో చిరుతను పట్టుకోవాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇంతలో ఇప్పుడు చిరుత ఏకంగా బాలికను బలి తీసుకుంది.

వరుస ఘటనలతో ఆందోళన: శుక్రవారం రాత్రి మిస్ అయిన బాలికను చిరుత చంపినట్లు అధికారులు గుర్తించారు. గత వారం నడక మార్గంలో ఎలుగుబంటి సంచరించిన ఫుటేజ్ సీసీ కెమేరాల్లో గుర్తించారు. దీంతో, అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. అలిపిరి మార్గంలో మొత్తం 3,550 మెట్లు ఉన్నాయి.

పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అయితే, చిరుత దాడి చేసి చంపి ఉంటే చిన్నారి మృత దేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లదనే అభిప్రాయం కూడా అధికారుల నుంచి వ్యక్తం అవుతోంది. అయితే, బాలిక మరణించటం పైన టీటీడీ విచారం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన పైన అధికారులు విచారణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+