తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండేళ్ల తరువాత భక్తుల మధ్య తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఆ దర్శనం టికెట్లు రద్దు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేపట్టారు. వాహ‌న‌ సేవ‌లన్నింటినీ ఇదివరకట్లా తిరుమాడ వీధుల్లో.. లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య కన్నులపండువగా నిర్వహించేలా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. రెండేళ్ల తరువాత భక్తుల మధ్య తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలను నిర్వహించబోతోన్నందున అంచనాలకు మించి భక్తులు పాల్గొనే అవకాశం ఉందని భావిస్తోంది.

ఏర్పాట్లపై సమీక్ష..

ఏర్పాట్లపై సమీక్ష..


ముందస్తు ఏర్పాట్లపై టీటీడీ కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి సహా టీటీడీకి చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భ‌క్తుల‌కు స్వామివారి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తామని ఈఓ చెప్పారు. దీనికోసం అన్నిర‌కాల ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు 300 రూపాయల టికెట్లు, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తామని అన్నారు.

సర్వదర్శనం మాత్రమే అందుబాటులో..

సర్వదర్శనం మాత్రమే అందుబాటులో..

సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తామని స్పష్టం చేశారు. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను కూడా పెంచే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం, శ్రీవాణి ట్ర‌స్ట్, ఇత‌ర ట్ర‌స్టుల దాతలకు ద‌ర్శ‌న‌ టికెట్లు రద్దు చేశామ‌ని పేర్కొన్నారు. ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్లు చెప్పారు.

ప్రొటొకాల్ వీఐపీలకు..

ప్రొటొకాల్ వీఐపీలకు..

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ వీఐపీల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంద‌ని ఈఓ స్పష్టం చేశారు. భక్తుల రద్దీకి తగ్గట్టు లడ్డూలు బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకుంటామ‌ని చెప్పారు. భ‌ద్ర‌త అవ‌స‌రాల కోసం పోలీసు అధికారులు అడిగిన మేర‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని, ఇందులో భాగంగా 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామ‌ని, అన్ని ముఖ్య‌మైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంద‌ని చెప్పారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామనీ ఆయన వివరించారు.

సెప్టెంబర్ 27వ తేదీన..

సెప్టెంబర్ 27వ తేదీన..

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వ‌ర్ణ‌ర‌థం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం ఉంటాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో తొలి రోజైన సెప్టెంబర్ 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈఓ వెల్లడించారు. తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌నసేవ ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు.

English summary
TTD to suspend all forms of VIP and privilege darshan during Srivari Brahmotsavams at Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X