Tirumala: అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, శ్రీవారి దర్శనభాగ్యం, గోవిందా గోవింద!
తిరుమల/తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

అశ్వ స్వరూపంలో శ్రీవారు
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

గోవిందా.... గోవింద
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి మహతి కళాక్షేత్రంలో హైదరాబాద్ కు చెందిన సురభి ఆర్ట్స్ శ్రీ వినాయక నాట్య మండలి శ్రీనివాస కల్యాణం పౌరాణిక నాటకం అద్భుతంగా ప్రదర్శించింది .శ్రీ ఆర్.వేణుగోపాల్ బృందం 45 మంది మంది కళాకారులతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యంతం సభాసదులను భక్తిరస సాగరంలో ఓలలాడించింది .

బ్రహ్మోత్సవాలు
తిరుపతి పుర ప్రముఖులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు.అలాగే అన్నమాచార్య కళా మందిరంలో బెంగుళూరుకు చెందిన కుమారి ఐశ్వర్య మహేష్ బృందం భక్తి సంగీత గానం భక్తులను ఆకట్టుకుంది .ఈ కార్య్రమంలో కుమారి ఐశ్వర్య మహేష్, చక్రపాణి, బాలసుబ్రమణ్యం సహకరించారు.
-
శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-టైమింగ్స్, స్టాప్ లు ఖరారు..! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!!












Click it and Unblock the Notifications