TTD: అన్నప్రసాద విరాళంపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం ఒకరోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ పథకంలో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఒకరోజు పూర్తిగా అన్న ప్రసాద వితరణ కోసం 38 లక్షల రూపాయలు విరాళం ఇవ్వాల్సి ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఇప్పటివరకు ఈ విరాళం మొత్తం 33 లక్షల రూపాయలు ఉండగా, ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో టిటిడి 38 లక్షల రూపాయలకు విరాళాన్ని పెంచింది.

ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో దీన్ని అనివార్యంగా భావించి విరాళాన్ని పెంచింది. ఉదయం అల్పాహారం కోసం ఎనిమిది లక్షల రూపాయలు, మధ్యాహ్న భోజనం కింద 15లక్షలరూపాయలు, రాత్రి భోజనం కోసం 15 లక్షల రూపాయలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించవచ్చు అని టీటీడీ పేర్కొంది.
ఇక ఆరోజు విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తారని, అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు అక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కూడా పొందవచ్చని టీటీడీ పేర్కొంది. ప్రతిరోజు తిరుమలకు లక్షల సంఖ్యలో వారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక కొన్ని ప్రముఖ దినాలలో అయితే 3 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు.
జనవరి 1 నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఇక బ్రహ్మోత్సవాల సమయంలోను రోజుకు మూడు లక్షలకు మందికి పైగా భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇదిలా ఉంటే తిరుమలలో ప్రతిరోజు అన్న ప్రసాదాల తయారీకి 14 నుండి 16.5 టన్నుల బియ్యం, 6.5 నుండి 7.5 టన్నులు కూరగాయలు వినియోగిస్తుంటారు.












Click it and Unblock the Notifications