తిరుమల వసతి గదుల బుకింగ్‌లో సమూల మార్పులు: భారీగా ప్రక్షాళన

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 63,493 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,676 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.69 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

TTD plan to eradicate middlemen menace at Tirumala

కాగా- శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు కల్పిస్తోన్న దర్శనం, వసతి, తదితర సేవల్లో దళారుల ప్రమేయం లేకుండా చేయాలని, మరింత పారదర్శకంగా అందించడానికి టీటీడీ చర్యలు తీసుకుంది. దీనికోసం కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోనుంది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ ద్వారా నిజమైన భక్తులను గుర్తించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.

ఏడాది కాలంగా ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి గదుల కేటాయింపు, ఆర్జిత సేవలు, వర్చువల్ టికెట్ల జారీ, ఆఫ్‌లైన్‌లో మంజూరు చేసే సర్వదర్శనం టోకెన్లు, వసతి గదుల బుకింగ్‌‌పై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఓకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్‌గా బుకింగ్ పొందినట్లు విచారణలో తేలింది. ఈ ఏడాది తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు, 124 బుకింగ్స్ సంబంధించి 12కు పైగా గదులు పొందినట్లు అధికారులు నిర్ధారించారు.

ఆన్‌లైన్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 807, ఒకే ఇమెయిల్ ఐడిని ఉపయోగించి 926 వసతి గదులను మధ్యవర్తులు బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. ఒకే మొబైల్ నంబర్‌ ద్వారా ఒక ఏడాదిలో 1,279, ఒకే మెయిల్ ఐడిపై 48 డిప్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ధృవీకరించారు. ఒకే ఐడి ప్రూఫ్‌ను ఉపయోగించి 14 సర్వదర్శనం టోకెన్లను సైతం పొందినట్లు వెల్లడైంది.

ఈ నేపథ్యంలో- మధ్యవర్తులను నిర్మూలించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. బల్క్ బుకింగ్‌లకు ఉపయోగించే మొబైల్ నంబర్లు, మెయిల్‌, ఐడి ప్రూఫ్‌లను రద్దు చేశారు. ఫేక్ మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడిలు, ఐడి ప్రూఫ్ లు ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబోవని తెలిపారు. బుకింగ్ రద్దు అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు తెలియజేస్తారు.

నిజమైన భక్తులను గుర్తించడానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు. దళారులు ఫేక్ మొబైల్, మెయిల్, ఐడి ప్రూఫ్‌లను ఉపయోగించి చేసిన బుకింగ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించారు. సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+