తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ- శాస్త్రోక్తంగా తిరుమంజనం

Vaikunta Ekadashi 2023: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. 18 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి నుంచి 18 గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. సోమవారం 61,499 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,789 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. టీటీడీకి హుండీ ద్వారా 4.14 కోట్ల రూపాయల ఆదాయం అందింది.

Vaikunta Ekadashi 2023: Koil Alwar Tirumanjanam was performed at Tirumala

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీ నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించనుంది టీటీడీ. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. కన్నులపండువగా ఈ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోన్నారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం కార్యక్రమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు.

సంవత్సరంలో నాలుగుసార్లు అంటే- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేశారు.

ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు.

Vaikunta Ekadashi 2023: Koil Alwar Tirumanjanam was performed at Tirumala

శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించడానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనాన్ని కల్పించడంలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+