rahul murder case:ముగ్గురు మహిళలు..? ఒకరికీ రూ. 6 కోట్లు.. ఏం జరిగింది.
రాహుల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పద్మజ, గాయత్రి, పద్మజలను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఒక పద్మజ ఏ1 నింతితుడు కోడారి విజయ్ కుమార్ భార్య అనే సంగతి తెలిసిందే. మరో ఇద్దరు గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రాహుల్ జరిగే హత్య సమయంలో వారు ఎక్కడున్నారు..? హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ముగ్గురిలో మహిళ రాహుల్‌కు రూ.6 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు ఇచ్చారు..? అందుకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.

అదుపులో ఆరుగురు
రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్... పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మాచవరం పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యాడు. విజయ్‌కుమార్ సహా మొత్తం ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ మర్డర్ కేసులో వారిని విచారిస్తున్నట్లు సమాచారం. రాహుల్‌లో కలిసి వ్యాపారం చేస్తున్న కోరాడ విజయ్‌కుమారే హత్య చేయించినట్లు పోలీసులు భావించారు. రాహుల్ మర్డర్ తర్వాత విజయ్‌కుమార్ పరారీ కావడంతో... అతడిపై అనుమానాలు బలపడ్డాయి. విజయ్‌కుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల్ని నియమించాయి. ఐదు రోజులుగా అతడి కోసం వేటాడుతున్నాయి. ఈ క్రమంలో విజయ్‌కుమార్.. ఇవాళ మాచవరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

నిన్న బాబు..
రాహుల్ మర్డర్ కేసులో అనుమానితుడిగా ఉన్న కోరాడ విజయ్‌కుమార్ డ్రైవర్... బాబును నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు దగ్గర టాస్క్‌ఫోర్స్ పోలీసులు బాబును అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ హత్య జరిగిన రాత్రి నుంచి కారు డ్రైవర్ బాబు పరారీలో ఉన్నాడు. డ్రైవర్‌పై నిఘా పెట్టిన పోలీసులు.. నిన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ మర్డర్‌పై బాబును విచారిస్తున్నారు.

ఇలా కేసు
రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యతో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని... తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్‌కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరాడ కుటుంబ సభ్యులకు హత్యతో సంబంధముందని రాహుల్ తండ్రి రాఘవరావు ఆరోపిస్తున్నారు. అయితే ఇవాళ కోరాడ విజయ్‌కుమార్ పోలీసులకు లొంగిపోయాడు.

కీలకంగా మారిన వాంగ్మూలం
రాహుల్ హత్య కేసులో కోరాడ విజయ్‌కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది. ప్రస్తుతం విజయ్‌కుమార్‌తో పాటు అతడి డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. విజయ్‌కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా హత్య కేసులో కోగంటి సత్యం పాత్రను పోలీసులు నిర్ధారించనున్నారు. కోగంటి సత్యం గురించి విజయ్‌కుమార్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఏ4, ఏ5గా ఉన్న తళ్లీ కూతుళ్లు.. గాయత్రీ, పద్మజల గురించి కూడా ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది. గాయత్రీ, పద్మజ పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మాచవరం పీఎస్‌లో కోరాడ విజయ్‌కుమార్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు.

ఆ హత్యతో లింక్
గతంలో హైదరాబాద్‌లో జరిగిన వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో కీలక నిందితుడైన శ్యామ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇవాళ కోరాడ విజయ్ కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు.
Recommended Video

తక్కువ మొత్తానికే కంపెనీ..
కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లు డ్రైవర్ బాబు పోలీసులకు తెలిపాడు. ఇదే అంశంలో గత ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. రూ. 15 కోట్లు విలువ చేసే జిక్సిన్ కంపెనీ30 శాతం వాటాను వెనక్కి ఇవ్వాలన్ని కోరాడు విజయ్. ఇందుకోసం రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బుల కోసం రాహుల్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. మరోవైపు విజయ్ వాటాను కొనేందుకు కోగంటి సత్యం ప్రయత్నించాడు. అతనికి కంపెనీలో షేర్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించాడు. దాంతో రాహుల్‌ను హత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు. మూడు నెలల క్రితమే రాహుల్ హత్యకు భారీ స్కెచ్ వేశారు. రాహుల్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది కోగంటి టీమ్‌గా పోలీసులు భావిస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications