విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎస్‌కు కేబినెట్ అభినంద‌న‌లు: అజెండాకే ప‌రిమితం : సోమిరెడ్డి కోడ్ ఉల్లంఘ‌న‌..!

|
Google Oneindia TeluguNews

ఎట్ట‌కేల‌కు ఏపీ మంత్రి స‌మావేశం జ‌రిగింది. ఊహించిన దానికి భిన్నంగా స‌మావేశం నిర్వ‌హించారు. కొద్ది రోజులుగా మంత్రులు వ‌ర్సెస్ సీఎస్ అన్న‌ట్లుగా మారిన ప‌రిస్థితికి పూర్తి భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. సీఎంతో స‌హా మంత్రులు సీఎస్ ప‌నితీరును అభినందించారు. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు అజెండాకే ప‌రిమితం అయ్యారు. కాగా, స‌మావేశం ముగిసిన త‌రువాత మీడియాలో మాట్లాడి మంత్రి సోమిరెడ్డి కోడ్ ఉల్లంఘించారు.

అజెండాకే ప‌రిమితం..

కొద్ది రోజులుగా రాజ‌కీయాల‌కు మించిన ఉత్కంఠ‌తో సాగిన ఏపీ కేబినెట్ నిర్వ‌హ‌ణ ఎట్ట‌కేల‌కు ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కే కేబినెట్ స‌మావేశం ప‌రిమిత‌మైంది. దాదాపు రెండు గంట‌ల పాటు సాగిన ఈ స‌మ‌వేశంలో
అజెండా ప్ర‌కారం నాలుగు అంశాల పైనే చ‌ర్చ సాగింది. సంబంధిత అధికారులు వీటి పైన ఉన్న ప‌రిస్థితిని కేబినెట్‌కు నివేదిక రూపంలో అంద‌చేసారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు..ఉపాధీ హామీ మీద చ‌ర్చ జరిగింది. గ్రామీణ‌.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నీటి నిల్వ‌ల పైన సీఎం ఆరా తీసారు. ఉపాధిహామీ పథకం అమలులో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిన అంశం చర్చకు వచ్చింది. ఐదు విభాగాల్లో మొదటి స్థానంలో, ఆరు విభాగాల్లో రెండో స్థానంలో ఏపీ నిలిచిందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీంతో సంబంధిత శాఖ అధికారుక చంద్రబాబు అభినందించారు.

సీఎస్‌కు అభినంద‌న‌లు..

ఎన్నిక‌ల స‌మ‌యం నుండి ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం మీద ముఖ్య‌మంత్రి మొద‌లు అనేక మంది టీడీపీ నేత‌లు ప‌లు ఆరోప‌ణ‌లు చేసారు. కేబినెట్ నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో సీఎస్ పైన మంత్రులు ఫైర్ అవుతార‌ని అంద‌రూ అంచ‌నా వేసారు. అయితే, సోమ‌వారం సీఎస్ వెళ్లి ముఖ్య‌మంత్రితో నేరుగా స‌మావేశం కావ‌టంతో స‌మ‌స్య ప‌రిష్కారం అయింది. ఇక‌, కేబినెట్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌హా మంత్రులు సైతం సీఎస్‌తో న‌వ్వుతూనే మాట్లాడ‌టం కనిపించింది. ఇక‌, ఫోనీ తుఫాను స‌మ‌యంలో ప్ర‌భుత్వం భాగస్వామ్యం లేక‌పోయినా.. అధికారుల‌తో క‌లిసి న‌ష్ట నివార‌ణ‌..ముంద‌స్తు చ‌ర్య‌ల్లో సీఎస్ చూపిన చొర‌వ‌ను ముఖ్య‌మంత్రి..మంత్రులు అభినందించారు. అదే విధంగా ఆర్జీజీఎస్ విధులను కేబినెట్ ప్ర‌శంసించింది. తుఫాను గురించి ముందుగానే చెప్పే ఆర్టీజీఎస్ టీడీపీకి వ‌చ్చే ఓట్ల సునామీ గురించి చెప్ప‌లేదా అని మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ప్ర‌శ్నించ‌గా అందరూ న‌వ్వేశారు.

సోమిరెడ్డి కోడ్ ఉల్లంఘ‌న‌..!

సోమిరెడ్డి కోడ్ ఉల్లంఘ‌న‌..!

ఇక‌, ఇదే స‌మావేశంలో ప్ర‌ధానంగా తాగు నీటి స‌మ‌స్య‌ల లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎన్నిక‌ల కోడ్ పేరుతో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ద్వారా అందించిన చెక్కులు చెల్లుబాటు కాకుండా..వెన‌క్కు వ‌స్తున్నాయ‌ని ఇది స‌రి చేయాల‌ని మంత్రులు కోరారు. ఎన్నిక‌ల కోడ్ ప్రకారం కేబినెట్ స‌మావేశం ముగిసిన త‌రువాత నిర్ణ‌యాల పైన మంత్రులు మీడియాకు అధికారికంగా స‌మాచారం ఇవ్వ‌కూడ‌దు. అయితే, కేబినెట్ స‌మావేశం ముగిసిన వెంట‌నే మంత్రి సోమిరెడ్డి స‌చివాల‌య ప్రాంగ‌ణంలోనే వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.ఫోనీ తుఫాను కార‌ణంగా ఉద్యాన వ‌న పంట‌లు దెబ్బ తిన్నాయ‌ని వివ‌రించారు. త‌మ‌కు అధికారుల‌తో ఎటువంటి వివాదం లేద‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, అధికారులు మాత్రం మంత్రి సోమిరెడ్డి కోడ్ ఉల్లంఘించ‌లేద‌ని.. మీడియా అడిగితే త‌న శాఖ‌కు సంబంధించిన వివ‌రాల‌ను మాత్ర‌మే వెల్ల‌డించార‌ని చెబుతున్నారు.

English summary
With Election Commission permission AP Cabinet held in Amaravati. Discussed on fixed agenda in four issues. Cm and Officers appreciated CS LV Subramanyam on Cyclone advance steps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X