విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీబస్సు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి; మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద అదుపు తప్పి జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు బస్సు ప్రమాద ఘటనలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్ .. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్ .. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా


బస్సు వాగులో బోల్తా పడిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసిన ముఖ్యమంత్రి జగన్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం జగన్ ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. విషమంగా ఉన్న క్షతగాత్రులను హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తరలించి మెరుగైన వైద్యం అందించాలని తగు చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య .. ఇప్పటివరకు 10 మంది మృతి

ప్రమాద ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య .. ఇప్పటివరకు 10 మంది మృతి

ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 10 కి చేరుకుంది. పూర్తి స్థాయిలో బస్సు ప్రమాదానికి సంబంధించిన నివేదిక ఇవ్వడం కోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి 22 మంది క్షతగాత్రులను 108 వాహనాలలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి

సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి


పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సంఘటన స్థలానికి చేరుకోనున్నారు .అలాగే ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని కూడా సంఘటన స్థలానికి చేరుకోవడానికి ఏలూరు నుండి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో జంగారెడ్డిగూడెం డిఎస్పి రవికిరణ్, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే బస్సు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గా సమాచారం. బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

మృతుల వివరాలుసేకరిస్తున్న ఆర్టీసీ అధికారులు


ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా కూడా లేదని బస్సు కండక్టర్ తెలిపారు. మరో పది కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం కి చేరుకుంటారనుకున్న సమయంలో చోటు చేసుకున్న దారుణ ప్రమాద ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వేరొక వాహనాన్ని తప్పించబోయి, బస్సు డ్రైవర్ వంతెన రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి జల్లేరు వాగు లో పడిపోయినట్లు గా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలు తెలుసుకోవడం కోసం ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉన్నట్లుగా సమాచారం. ఘోర బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు, లోకేష్ లు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

English summary
AP CM Jagan Expressing his condolences to the families of those died in the bus accident, Chief Minister Jagan directed the authorities to provide ex-gratia of Rs.5 lakh to the families of the deceased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X